Home

»

Tv News

బిగ్ బాస్ సీజన్-10కి చైత్ర రాయ్.. గ్లామర్ ప్లస్ ఎమోషన్ చూపిస్తుందా.!

Sep 6, 2026 3:04PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి ఎంట్రీ ఇస్తున్న మరో స్టార్ హీరోయిన్ చైత్ర రాయ్. స్టార్ మా సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన చైత్ర, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది. సెప్టెంబర్ 6న జరగబోయే గ్రాండ్ ప్రీమియర్ లో నాగార్జున చేతుల మీదుగా 10 మంది సెలబ్రిటీలలో ఒకరిగా ఆమె ఎంట్రీ కన్ఫమ్ అయింది. ఈ సీజన్-10 లో గ్లామర్ క్వీన్స్ లో చైత్ర ఒకరు.

 

చైత్ర రాయ్ ఎవరంటే... కన్నడ బ్యూటీ, కానీ తెలుగు సీరియల్స్ తో ఫేమస్ అయింది. ముఖ్యంగా అష్టా చెమ్మ సీరియల్ తర్వాత ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. అంతకుముందు స్టార్ మా లోనే పలు సీరియల్స్ లో నెగిటివ్, పాజిటివ్ రోల్స్ చేసి మెప్పించింది. తన అందం, నటనతో బుల్లితెరపై సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా చైత్ర చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా రీల్స్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.

 

బిగ్ బాస్ హౌస్ లో చైత్ర గేమ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీరియల్ లో చాలా సాఫ్ట్ గా కనిపించే చైత్ర, నిజ జీవితంలో చాలా స్ట్రాంగ్, బోల్డ్ గా ఉంటుంది. అయితే తనకి ఒక పాప.. తనని వదిలి హౌస్ లోకి వస్తున్న చైత్ర.. గొడవలు, టాస్కులు, ఎమోషనల్ డ్రామాలో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందోననే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. గత సీజన్లలో సీరియల్ హీరోయిన్స్ ఫైనల్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.. అదే సెంటిమెంట్ తో చైత్ర కూడా టైటిల్ కంటెండర్ అవ్వొచ్చని టాక్. మొత్తానికి బిగ్ బాస్ సీజన్-10 లో చైత్ర రాయ్ ఎంట్రీతో హౌస్ లో గ్లామర్ డోస్ పెరగడం గ్యారెంటీ. దశావతారం థీమ్ తో వస్తున్న ఈ సీజన్ లో వర్షిణి, దెబ్జాని, చైత్ర లాంటి గ్లామర్ బ్యూటీస్ మధ్య హౌస్ లో పోటీ రసవత్తరంగా ఉండబోతోంది.

 

 

[Chaitra Rai Bigg Boss Telugu 10, Aastachemma Chaitra Rai Bigg Boss Entry, Chaitra Rai Bigg Boss House]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com