
తెలుగు టీవీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు దశావతారం గ్రాండ్ లాంఛ్ అయింది. ఈసారి హోస్ట్ కింగ్ నాగార్జున ఒంటరిగా కాదు.. ఒక హైటెక్ రోబోతో కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంట్లో కావాల్సింది తెలివితేటలు, లెక్కలు, డేటా మాత్రమే కాదు, ఎమోషన్స్ తో అల్లుకున్న చిక్కులు అని నాగార్జున అన్నారు. ఇలాంటి కాన్సెప్ట్ తను గత 9 సీజన్లలో ఎప్పుడూ చూడలేదని అవాక్కయ్యారు.
ఈ సీజన్ మెయిన్ హైలైట్ తలరాతలు మార్చే మ్యాజిక్ కీ. 10వ సీజన్లో 10 స్పెషల్ పవర్స్ ఉంటాయని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దశావతారం థీమ్ అంటేనే ప్రతి కంటెస్టెంట్ లో 10 అవతారాలు బయటకు వస్తాయని అర్థం. బిగ్ బాస్ చరిత్రలోనే అద్భుతం జరిగింది. ఒకేసారి 4 భాషల్లో 4 బిగ్ బాస్ షోలు ప్రారంభం అవుతున్నాయని నాగార్జున ప్రకటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం హోస్టులు మోహన్ లాల్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లతో వర్చువల్ గా మాట్లాడారు. గడిచిన 9 సీజన్ల జ్ఞాపకాలు, ఎమోషన్స్, సెలబ్రేషన్స్ ను గుర్తు చేసుకుంటూ షో మొదలైంది.
మొత్తానికి ఈ సీజన్ ఫుల్ టెక్నాలజీ, ఫుల్ ఎమోషనల్ గేమ్ తో ఉండబోతోంది. రోబో ఎంట్రీతోనే మేకర్స్ ఏదో కొత్తగా ప్లాన్ చేశారని అర్థమవుతోంది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.




.webp)
