Home

»

Tv News

Jabardasth Latest Promo: అప్పారావు-వర్ష డబుల్ మీనింగ్ పంచ్ లు, తాగుబోతు రమేష్ రచ్చ..

Sep 22, 2026 10:55AM

ప్రతీ ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నవ్వులు పువ్వులు పూయించడానికి జబర్దస్త్ కామెడీ కింగ్స్ సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. మొదటగా అప్పారావు, వర్ష ఎంట్రీ ఇస్తారు. మనం ఎందుకండి ఇంత గ్యాప్ ఇచ్చామని వర్ష అనగానే నీకేం.. ఇంత చేయమంటే ఇంత చేస్తావ్.. నాకేమో ఇంత చేయమంటే అంత చేస్తానని అప్పారావు అనగానే అందరు నవ్వుతారు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది, వాళ్లు ఎంత ఇస్తే అంతే చెయ్యాలని అప్పారావు అనగానే మరింత నవ్వుతారు.

ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్, సుధాకర్ వచ్చి తమదైన స్టైల్ లో కామెడీ పండిస్తారు. సినిమాకి తీసుకెళ్తే సీట్ అనుకొని ఎవడో దీని ఒళ్లో కూర్చున్నాడని భాస్కర్ అనగానే మరి అరవలేదా అని ఒకావిడ అనగానే వాడే ఇంటర్వెల్ లో దీన్ని చూసి అరిచాడని భాస్కర్ అంటాడు. అందరూ నవ్వేస్తారు. ఆ తర్వాత సద్దాం అండ్ టీమ్ ఘోస్ట్ లాగా ఎంట్రీ ఇచ్చి ఏసే నాగుల కట్ట మీద సాంగ్ ని స్లో మోషన్ లో పాడుతుంటే.. ఏంట్రా సాంగ్ ని కూడా చంపేశారని జడ్జ్ ఇంద్రజ అంటుంది. అప్పుడే వాళ్ల దగ్గరికి డైరెక్టర్ వస్తాడు‌ కొన్ని సినిమా టైటిల్స్ ని ఘోస్ట్ తో డిస్కషన్ చేస్తుంటే అవి ఫన్నీగా అనిపిస్తాయని అంటాడు. చంటి తన టీంతో తనదైన స్టైల్ లో కామెడీ పండించాడు.

ఆ తర్వాత తాగుబోతు రమేష్ వస్తాడు. అబ్బా పెళ్లి కాకముందు అన్ని పనులు మనమే చేసుకుంటాం, పెళ్లి అయ్యాక అన్నీ పెళ్లాం చేస్తుంటే బాగుంటుందని అంటాడు. అప్పుడే రోహిణి కాఫీతో వస్తుంది. ఏంటి ఇది, ఇప్పుడే పనిమనిషిని పెట్టిందా అని అంటాడు. లేదండి నేనే మీ భార్యని అని రోహిణి అంటుంది. ఎలా నమ్మాలి నువ్వే నా భార్య అని అని రమేష్ అనగానే రాత్రి ఏం జరిగిందో చెప్పమంటారా అని రోహిణి అంటుంది. చెప్పు అని రమేష్ అంటాడు. మీరు ముందు గదిలోకి రాగానే తలుపు వేశారని రోహిణి అంటుంది. ఎవరైనా అలాగే చేస్తారని రమేష్ అనగానే.. అందరు అలాగే చేస్తారు కానీ మీరు మళ్ళీ తలుపు ఓపెన్ చేశారని రోహిణి అనగానే అందరూ నవ్వుతారు. ఆ తర్వాత ధన్ రాజ్ తన పర్ఫామెన్స్ తో అందరిని మెప్పించాడు. డబుల్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Jabardasth, Jabardasth Latest Promo, Dhanraj, Varsha, Apparao, Bullet Bhaskar, Sudhakar, Saddam, Indraja, Rohini]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com