.webp)
బిగ్ బాస్ సీజన్ 10 మూడో వారం నామినేషన్ ప్రక్రియలో హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. అందులో ఫస్ట్ రామ్ ప్రసాద్ కి ఇద్దరిని నామినేషన్ చేసే అవకాశం రాగా ఒక్క నామినేషన్ గా వంశీని చేసి, మరొకటి రోహిత్ కి ఇచ్చాడు. ఇక రోహిత్ వచ్చి తను సుధీర్ ని నామినేషన్ చేస్తున్నట్టుగా చెప్పాడు. ఎందుకని రీజన్ అడిగితే తనకి ఆలోచించే అది లేదు.. ఎవరేం చెప్పినా చేస్తాడు.. ఈజీగా మ్యానిపులేట్ అవుతాడని రోహిత్ అంటాడు.
నేను ఎవరికి ఇన్ ఫ్లూయెన్స్ అవ్వలేదు.. అక్కడ ఇండివిడ్యువల్ గా పాయింట్లు పెడుతున్నారు కానీ మళ్ళీ గ్రూప్ అంటున్నారు. నా పాయింట్ చెప్పినా అక్కడ ఆ అవకాశం రాలేదంటూ సుధీర్ చెప్తాడు. త్రిగుణ్ దగ్గరికి వెళ్ళి శ్రిష్టి గురించి అలా అడగడం కరెక్ట్ కాదని, త్రిగుణ్ కి పప్పెట్ లాగా సుధీర్ ఉన్నాడని రోహిత్ అనగానే త్రిగుణ్ ఇన్వాల్వ్ అవుతాడు. అతనొచ్చి నన్ను అడిగితే నేను చెప్పాను తప్పా.. నేనే సొంతంగా వెళ్ళి చెప్పలేదంటూ త్రిగుణ్ రెచ్చిపోతాడు. త్రిగుణ్ ఒక మ్యానిపులేటర్ అని సుధీర్ అంటాడు. అన్నా. అన్నా.. శ్రిష్టికి నాకు హైట్ కుదురుతుంది.. ఎలా మాట్లాడాలి.. ఎలా కమ్యూనికేట్ అవ్వాలి టిప్ చెప్పు అన్నా అని నేనొచ్చి అడుగలేదు.. నువ్వే వచ్చి నన్ను అడిగితే చెప్పానని త్రిగుణ్ అంటాడు. దాంతో శ్రిష్టికి కోపం వస్తుంది. నాకు ఏం చెప్పావ్.. ఇదేంటని అడుగుతుంది. దాంతో సుధీర్ అందరి ముందుకి వచ్చి..శ్రిష్టి నేను జస్ట్ ఫ్రెండ్స్ అంతే మా మధ్య ఏం లేదు. దయచేసి మాకు ఏ ట్రాక్ పెట్టొద్దని అంటాడు.
ఏం మాటాడుతున్నావ్ నా గురించి ఎందుకు అలా వాగుతున్నావ్..నువ్వు నాకు ఫ్రెండ్ కాదు. నాతో మాట్లాడొద్దు..ఇంకోసారి మాట్లాడితే చెంపలు వాయిస్తా.. పళ్ళు రాలగొడతానని శ్రిష్టి ఫైర్ అయింది. హమ్నయ్య.. నేను ఫ్రెండ్ కాదంట.. నాకు ఫ్రీడమ్ దొరికింది బిగ్ బాస్.. ఇకనుండి నేను ఫ్రీగా ఉంటా.. థాంక్స్ అని సుధీర్ అంటాడు. దాంతో శ్రిష్టి ఇంకా రెచ్చిపోయింది. ఫస్ట్ ఏ చెప్పా నీకు..నా టైప్ కాదని..పిచ్చి వేషాలు వేస్తే.. ఒక్క గుద్దు గుద్దితే పళ్ళు రాలిపోతాయ్.. అని శ్రిష్టి అంటుంది. నేనేమైనా పట్టుకొని ఉంటున్నానా అని శ్రిష్టి అంటుంది. ఆ తర్వాత సుధీర్ ఏదో చెప్పబోతుంటే నోరు మూసుకో నేను మాట్లాడినప్పుడు అని సుధీర్ అంటాడు. నువ్వు మాట్లాడకని ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. సో త్రిగుణ్ మ్యానిపులేట్ చేశాడని సుధీర్ అనడంతో ఏ నీకు బుర్ర లేదా.. బుద్ది లేదా.. నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావా.. నేను మ్యానిపులేట్ చేస్తే పప్పెట్ లా మారతావా అంటూ త్రిగుణ్ కూడా రెచ్చిపోయాడు. ఇక త్రిగుణ్, సుధీర్ ల మధ్య కాసేపు గొడవ జరిగింది.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో వంశీ, సుధీర్, షాలినీ, శ్రిష్టి, త్రిగుణ్, ఝాన్సీ నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్ లో.. శ్రిష్టి, సుధీర్ ల మధ్య సాగిన గొడవ హైలైట్ గా నిలిచింది. ఇంకా కొందరి నామినేషన్లు మిగిలే ఉన్నాయి. ఇంకా హౌస్ లో ఈ వారం ఎంతమంది నామినేషన్ లో ఉన్నారో తెలియాలంటే మంగళవారం నాటి ఎపిసోడ్ టెలి కాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.
[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Bigg Boss Telugu Nominations, Sudheer, Srushti, Trigun, Rohith, Vamsi, Shalini, Jhansi]






