Home

»

Tv News

జబర్దస్త్‌కు తగ్గని క్రేజ్.. ఎన్ని సంవత్సరాలు గడిచినా షోకు అదే జోష్! తాజా ప్రోమో వైరల్

Sep 9, 2026 2:44PM

సద్దాం హుస్సేన్ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. డైరెక్ట్ చేసే ప్రక్రియలో కామెడీ పండిస్తాడు. ఆ తర్వాత ధన్ రాజ్ ఎంట్రీ ఇస్తాడు. ధన్ ధన్ సిమ్ అని అమ్ముతాడు. ఈ సిమ్ స్పెషల్ ఏంటి అంటే ఇన్కమింగ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఫ్రీ, మిస్డ్ కాల్ కూడా ఫ్రీ అని అంటాడు. దాంతో వచ్చిన కస్టమర్ అబ్బా మిస్డ్ కాల్ కూడా ఫ్రీ అంటా అని హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. మిస్డ్ కాల్ ఎక్కడైనా ఫ్రీ రా మొగుడా అని అతని భార్య అనగానే అందరు నవ్వుతారు.

మీరు మా నెట్ వర్క్ లోకి ఎంట్రీ అయ్యారంటే మేము మీ లైఫ్ లోకి ఎంట్రీ అవుతాం సర్ అని ధన్ రాజ్ అంటాడు. మేం రెండు కళ్ళతో చూడము సర్.. రెండు శాటిలైట్ తో చూస్తామని ధన్ రాజ్ అనగానే అద్భుతం అని కస్టమర్ అంటాడు. ఇంకొక అద్భుతం ఏంటో చెప్పనా.. మీ ఆవిడ స్నానానికి వెళ్ళింది కదా టవల్ మర్చిపోయిందని ధన్ రాజ్ అనగానే అందరు నవ్వుతారు.

ఆ తర్వాత చలాకీ చంటి వచ్చి డ్యాన్స్ చేస్తుంటే హెల్త్ కండిషన్స్ చెప్తున్నావా అని నాగబాబు పంచ్ వేస్తాడు. చంటి దగ్గరికి నర్సు వచ్చి ఆపరేషన్ థియేటర్ లో మాస్క్ ఎందుకు పెట్టుకుంటారని అడుగుతుంది. డాక్టర్ ఎవరో తెలియొద్దని నాగబాబు అనగానే అందరు నవ్వుతారు.

ఆ తర్వాత ఇద్దరు గొడవపడి కత్తితో పొడుచుకొని చంటి డాక్టర్ దగ్గరికి వస్తారు. వెంటనే చంటి నర్సుతో కొత్త పేగులు, కొత్త కిడ్నీలు తీసుకొని రా అనగానే అదేంటి అవి కూడా కొత్తవి ఉంటాయా అని పేషెంట్ షాక్ అవుతారు. మొన్నే ఒకరివి పాడైనవి అయితే పేగులు తీసి ఆరేశానని వాటిని చూపిస్తాడు. దాంతో అందరు నవ్వుతారు.

ఆ తర్వాత పేషెంట్ కి ఒకావిడ ట్రీట్మెంట్ ఇస్తుంది. ఏంటి ఈవిడ కూడా డాక్టరా అని వాళ్ళు అడగగా కాళీగా ఉందని కుట్లు నేర్పించానని చంటి అనగానే అందరు నవ్వేస్తారు. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుందని ఏజెంట్ వెంకీతో చెప్తాడు. ఇప్పుడు అర్జెంట్ గా చనిపోయే వాళ్ళు ఎవరు ఉన్నారంటూ వెంకీ అనుకుంటాడు. అప్పుడే ఇద్దరు ముసలి వాళ్ళు కనిపిస్తారు. ఆ తర్వాత తాగుబోతు రమేష్ వాళ్ళ అమ్మ గురించి గొప్పగా చెప్తుంటే తన భార్య అయిన రోహిణికి కోపం వస్తుంది. కోపంతో వణుకుతూ ఉంటే అందరు నవ్వుతారు. ఆ తర్వాత సుధాకర్, ఫైమా వచ్చి తమ కామెడీతో షోకి హైలైట్ అవుతారు. మరింత ఎంటర్టైన్మెంట్ కావాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com