Home

»

Tv News

Bigg Boss 10 Telugu:రోహిత్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్.. గ్రూప్ గేమ్ పై రచ్చ!

Sep 9, 2026 10:07AM

బిగ్ బాస్ హౌస్ లో బ్యాగ్ టాస్క్ తర్వాత గ్రూప్ గేమ్ పై పెద్ద రచ్చ జరిగింది. యాంకర్ వర్షిణికి రాం ప్రసాద్ కి మధ్య పెద్ద డిస్కషన్ సాగింది. ముందే నన్ను ఎందుకు పిక్ చేసుకోలేదు.. నాకెందుకు బ్యాడ్జ్ ఇవ్వలేదని రాంప్రసాద్ ని వర్షిణి నిలదీసింది. రోహిత్ నిన్ను ఖచ్చితంగా తీసుకోడు అనే నమ్మకం ఉంది.. అందుకే నిన్ను చివరి వరకూ తీసుకోలేదని రాంప్రసాద్ చెప్పాడు. అక్కడితో గొడవ ఆగలేదు. రోహిత్ .. మనం ఓడిపోయినా పర్లేదు కానీ గెలవాలంటూ గీతోపదేశం చేయగా..ఓడిపోయినా పర్లేదు గెలవడం ఏంట్రా బాబూ.. సడెన్ గా నీలోకి రామకృష్ణ వచ్చేశాడంటూ ఆర్జే చరణ్ కౌంటర్ వేశాడు.

 

ఆ తర్వాత వర్షిణి, చరణ్ ల మధ్య డిస్కషన్ నడిచింది. గ్రూప్ అని అనడం తనకి నచ్చలేదని చరణ్ అనగా.. గ్రూప్ గా ఆడుతున్నప్పుడు గ్రూప్ గేమ్ అనకపోతే ఏమని అంటామని వర్షిణి రివర్స్ అయ్యింది. మీరంతా కలిసే ఉంటున్నారు కానీ మీతో ఝాన్సీ ఎందుకు కలవడం లేదని వర్షిణి అడగ్గా..ఝాన్సీ సెలబ్రిటీలతోనే దోస్తీ చేస్తుంది కాబట్టి అని చరణ్ అన్నాడు. ఝాన్సీ న్యూట్రల్ గా ఆడుతుంది. ఎవరు ఏం గేమ్ ఆడుతున్నారో ఆమెకు బాగా తెలుసు అని త్రిగుణ్ అన్నాడు. దీనికి ముఖేష్ గౌడ.. అగ్నిపరీక్ష అయిపోయింది.. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్లది కదా అని అన్నాడు. మనం అలాగే అనుకుని పప్పులో కాలేస్తున్నాం, కానీ వాళ్లు చాలా యూనిటీగా ఉన్నారని అసలు పాయింట్ చెప్పింది వర్షిణి.

 

ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటిసభ్యులుగా అనర్హులు ఎవరో చెప్పాలని టాస్క్ ఇచ్చారు. అప్పుడు వర్షిణి అనూహ్యంగా రోహిత్ పేరు చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. అగ్నిపరీక్ష చూసిన తర్వాత అతనితో మంచి వైబ్ ఉంటుందని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక నేనే పెద్ద తోపు, నేను పెద్ద దేవుడ్ని అన్న బిల్డప్ తో ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు. గేమ్ లో ఓడిపోయినా ఎదుటి పర్సన్ ని బ్లేమ్ చేశాడు. అగ్నిపరీక్షలో అతన్ని లేపిలేపి ఎక్కడో కూర్చోబెట్టారు. దాంతో అతనికి కళ్లు నెత్తికెక్కాయి. దొంగని దొంగ అంటే ఎంత కోపం వస్తుందో.. గ్రూప్ అనగానే సర్ గారికి కోపం తన్నుకొచ్చిందంటూ వర్షిణి కళ్లకు కట్టినట్టు చెప్పింది.అదే టాస్క్ లో శాలినిని దేబ్జానీ నామినేట్ చేసింది. ఇక్కడ అందరు సమానమే కానీ తను మాత్రం నేనే ఎక్కువ అనే ఫీలింగ్ లో ఉంది. తను ఎక్కడో పైన ఉంది. డామినేటింగ్ గా చేస్తుంది. ఈమె ప్రతీదీ గొడవ పడటానికే చేస్తుంది. ఇక్కడ అందరు మంచి ఫ్యామిలీల నుంచే వచ్చారు కానీ ఆమె మాత్రమే గొప్ప అన్నట్టు ఫీల్ అవుతుందంటూ దేబ్జానీ అంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com