Home

»

Tv News

పేరెంట్స్ లేరన్న సింపతీ వద్దు.. నా టాలెంట్ తో గెలవాలని వచ్చాను!

Sep 9, 2026 2:56PM

బిగ్ బాస్ హౌస్‌లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్ షాలిని దామెరా పటేల్. అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సొంతూరు కరీంనగర్. తెలుగు ఫ్యామిలీకి చెందిన షాలిని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది. అక్కడి నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయింది. తను సింగిల్‌గానే ఉన్నానని అగ్నిపరీక్షలో చెప్పింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ రీల్స్, ఫ్యాషన్ కంటెంట్‌తో లక్షల్లో ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్-2లో ఫైనలిస్ట్‌గా నిలిచి, జడ్జ్ నవదీప్ ఛాయిస్‌తో డైరెక్ట్‌గా మెయిన్ హౌస్‌లోకి ఎనిమిదవ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు ఓ ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లూయెన్సర్  కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది. నేను ఎనిమిది నెలల వయసులో ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అసలు నేను తనని చూడలేదు. నాన్న కూడా చనిపోయారని కన్నీళ్లు పెట్టుకుంది.

అగ్నిపరీక్షలో తనపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ.. నేను చేసింది వెన్నుపోటు అన్నారు కానీ అది నా ఉద్దేశం కాదు. నేషనల్ టెలివిజన్‌లో నన్ను బ్యాక్ స్టాబర్‌లా చూపించి టార్గెట్ చేశారు. మాకు ఆఫ్ స్క్రీన్‌లో పెద్ద గొడవ జరిగింది. కానీ దాన్ని చూపించలేదు. నన్ను నన్నుగానే.. నా పర్సనాలిటీని, నా కెపాబిలిటీని చూసి ప్రేక్షకులు ఇష్టపడాలి.. కానీ పేరెంట్స్ లేరు అనే సింపతీతో కాదు. హౌస్‌లో ఇచ్చి పడేస్తా.. జిమ్‌లో చేసిందంతా అక్కడ చూపిస్తానని షాలిని చెప్పింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com