
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -985 లో.....అపర్ణ గుడికి వెళ్లి అక్కడ లాయర్ ని కలిసి మాట్లాడుతుంది. ఆస్తులకి సంబంధించిన పవర్ అఫ్ ఆటార్ని రేఖ పేరు నుండి ఇందు పేరున మార్చాలని లాయర్ కి చెప్తుంది అపర్ణ. తప్పకుండా మేడమ్ అని లాయర్ చెప్తాడు. ఇప్పుడు మీకు ఫీజు ఇచ్చుకోలేను.. ఇవి తీసుకోండి అని తన బంగారు గాజులు లాయర్ కి ఇస్తుంది. ఆ తర్వాత ఇందు ఇంటర్వ్యూకి లేట్ గా వెళ్తుంది. ఇంటర్వ్యూ పూర్తి అయిందని అక్కడ సెక్యూరిటీ చెప్పినా ఇందు అతన్ని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తుంది.
లోపల హెచ్ ఆర్ ఉంటాడు. ఇంటర్వ్యూ అయిపొయింది టైమ్ సెన్స్ లేదు అంటాడు. ప్లీజ్ సర్ నేను ఎప్పుడు టైమ్ ని ఫాలో అవుతాను. ఒక అతని వల్ల లేట్ అయిందని ఇందు చెప్తుంది. నువ్వు టైమ్ కి విలువ ఇస్తే నీకు అందరు విలువ ఇస్తారని హెచ్ ఆర్ చెప్తాడు. ఇక వెళ్ళమని చెప్పగానే ఇందు డిస్సపాయింట్ అయి వెళ్తుంది. మరొకవైపు రాజు లక్కీ కలిసి ఒకతనితో డీలింగ్ కుదుర్చుకుంటారు. పాత ల్యాప్ టాప్ లు అన్ని యాభై వేయిలకి తీసుకొని ఆఫర్ అంటూ అమ్మి అయిదు లక్షలు సంపాదించాలని అనుకుంటారు.ఆ తర్వాత ఇందు, అపర్ణ వేరువేరుగా ఒకేసారి ఇంటికి వస్తారు ఎక్కడికి వెళ్ళారని అపర్ణని ఇందు అడుగుతుంది. ఇప్పుడు లాయర్ తో మాట్లాడిన విషయం తెలిస్తే అవన్నీ ఎందుకు అంటుంది.. చెప్పకపోవడం బెటర్ అని అపర్ణ అనుకొని గుడికి వెళ్ళాలని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు లోపలికి రాగానే డాక్టర్ బయటకు వెళ్తాడు ఏమైందని ఇందు అడుగుతుంది. మీ తాతయ్యకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చిందని రేఖ చెప్పగానే త్వరగా లోపలికి వెళ్లి సుభాష్ తో మాట్లాడతారు.
బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చిందట.. ఇప్పుడు ఎలా ఉన్నారని ఇందు అడుగగా నాకేం కాలేదు డాక్టర్ వచ్చి మాములుగా చెకప్ చేసి ఇంజక్షన్ వేసి వెళ్ళాడని సుభాష్ చెప్తాడు. ఆ తర్వాత ఏంటి నువ్వు డాక్టర్ ని పిలిచి ట్రీట్ మెంట్ ఇప్పించావని రేఖతో భ్రమరాంబ అనగానే వెయిట్ వదిన అని రేఖ అంటుంది. అప్పుడే సుభాష్ కి బ్రీతింగ్ ప్రాబ్లమ్ మొదలవుతుంది. అదంతా రేఖ కావాలని చేస్తుంది. తరువాయి భాగంలో నాకు వ్యతిరేకంగా కోర్ట్ లో కేసు వెయ్యమని లాయర్ ని కలుస్తావా అని రేఖ అనగానే అపర్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





