Home

»

Tv News

Podharillu :విడాకుల బాంబ్ పేల్చిన మహా.. షాక్‌లో కుటుంబ సభ్యులు!

Mar 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -75 లో.....మాధవ త్వరగా ఇంటికి వస్తాడు. ఏమైందని కన్నా అడుగుతాడు. తలనొప్పి అని మాధవ చెప్పగానే మహా టీ తీసుకొని వస్తుంది. గాయత్రికి పెళ్లి ఫిక్స్ అయిందని అలా ఉన్నావా.. నీకు గాయత్రి అంటే చాలా ఇష్టమా అని మహా అడుగుతుంది. దాంతో మాధవ, గాయత్రితో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు. మరొకవైపు శైలు డిస్సపాయింట్ గా తన ఫ్రెండ్ దగ్గరికి వస్తుంది. వాళ్ళు ఇద్దరు కేశవ మెకానిక్ షాప్ ముందే ఉంటారు.

నా ప్లాన్ నాకే రివర్స్ అయింది ఫోన్ కొట్టేసాను.. మళ్ళీ వాడు నా దగ్గర నుండి ఫోన్ కొట్టేసాడని శైలు చెప్తుంది. అసలు వాడు ఎలా చూసాడని తన ఫ్రెండ్ తో శైలు అంటుంటే ఇలా అంటూ కేశవ బయటకు వస్తాడు. దాంతో శైలు షాక్ అవుతుంది. మరొకవైపు కానిస్టేబుల్ ధర్మేంద్రని చక్రి కలుస్తాడు. మీరు చాలా హెల్ప్ చేశారు. మీరు ఫోన్ చేసి అడగడం వల్ల నా భార్య విడాకులు అన్న ఆలోచన మానుకుందని చక్రి అంటాడు. ఎలాగైతే ఏంటి మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలని కానిస్టేబుల్ అంటాడు. మరొకవైపు కేశవ దగ్గరికి రిపేర్ కోసం లాయర్ వస్తాడు. నువ్వు చక్రి వాళ్ళ తమ్ముడివి కదా మీ అన్నయ్య వదిన విడాకులు కావాలని నా దగ్గరికి వచ్చారని చెప్పగానే కేశవ షాక్ అవుతాడు.

వెంటనే ఇంటికి వెళ్లి చక్రిని అడుగుతాడు. నువ్వు తప్పుల మీద తప్పు చేస్తుంటే ఏ భార్య అయిన ఎందుకు ఉంటుందని కేశవ అనగానే విడాకులు కావాలి అంది నేను.. చక్రి కాదని మహా అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి అన్నయ్య నువ్వు ఏం మాట్లాడడం లేదని మాధవపై కేశవ కోప్పడతాడు. తరువాయి భాగంలో అందరికి నిజం చెప్పేసాక గుండె తేలిక అయిందని మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com