Home

»

Tv News

Karthika Deepam 2: బిడ్డను కోల్పోయిన బాధలో దీప.. పారిజాతానికి కార్తీక్ వార్నింగ్!

Mar 22, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-624 లో.. దీపకి ఆపరేషన్ జరుగుతుంది. ‌తను మెలుకవలోకి వస్తుంది. దాంతో కార్తీక్ తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. కడుపులోని బిడ్డ చనిపోయిందని దీప, కార్తీక్ ఎమోషనల్ అవుతారు. 

మరోవైపు జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. ఎలా ఉందని పారిజాతం అడుగగా నీరసంగా ఉందని జ్యోత్స్న చెప్తుంది. అదంతా ఒకే కానీ దీప ఎక్కడ ఉందని జ్యోత్స్న అడుగుతుంది. తన రూమ్ లో‌ ఉందని పారిజాతం చెప్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావని  జ్యోత్స్న అడుగుతుంది. మనం హాస్పిటల్ కి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దీప రూమ్ ముందే ఉన్నావా అని జ్యోత్స్న అడుగుతుంది. ఉన్నానా అంటే మధ్యలో దాసు అని చెప్తూ మనసులో మాట్లాడుకుంటుంది పారిజాతం. లేను అని తెలిస్తే ఉతికారేస్తుంది. నేను దాస్ ని ఎందుకు కలుస్తా లేదు లేదు.. దీప రూమ్ ముందే అలాగే కూర్చున్నా అని పారిజాతం అంటుంది. 

దీప ఆపరేషన్ థియేటర్ వైపు ఏమైనా వచ్చిందా అని జ్యోత్స్న అడుగగా లేదని పారిజాతం చెప్తుంది. దీప రాకుండా ఆపరేషన్ జరిగింది అంటే నేను సుమిత్ర కూతురిని అని జ్యోత్స్న అనుకుంటుంది. శౌర్య కోసం బావ తిరుగుతున్నాడా అని జ్యోత్స్న అడుగగా హాస్పిటల్ కి ఎప్పుడో వచ్చాడని, శౌర్య దొరికింది అని పారిజాతం చెప్తుంది. అసలు బావకి శౌర్య ఎలా దొరికిందని జ్యోత్స్న అడుగగానే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న, పారిజాతంకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. 

ఇక కాసేపటికి డాక్టర్ బయటకి వచ్చి.. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక సుమిత్ర గారు నిండు నూరేళ్ళు మీతోనే హ్యాపీగా ఉంటారని డాక్టర్ అనగానే అందరు హ్యాపీగా ఉంటారు. దీప ఎక్కడుంది డాక్టర్ నేను తనని చూడొచ్చా అని దశరథ్ అనగానే.. దశరథా సుమిత్రని కాపాడింది జ్యోత్స్న, తనని చూడాలి కానీ దీపని చూడటమేంటని పారిజాతం అడుగుతుంది. కడుపులో బిడ్డని మోయలేక తీసేసుకుంది దీప..అసలు అలాంటి దాన్ని చూడకపోవడమే బెటర్ అని పారిజాతం అంటుంది. వెంటనే పిన్నీ అని దశరథ్, అమ్మ అని దాస్ ఒకేసారి కోపంగా అంటారు. ఇద్దరు కలిసి పారిజాతం మీద సీరియస్ అవుతారు. 

ఆ తర్వాత రోజులన్ని మనవి కావు పారు అని పారిజాతంతో కార్తీక్ అంటాడు. ఎందుకు వాడు నీతో అలా  మాట్లాడుతున్నాడని శివన్నారాయణ అడుగగా అదేం లేదని, ఇది మాకు మామూలే అని పారిజాతం అంటుంది. శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారు సర్ అని శివన్నారాయణతో దాస్ అంటాడు. మరి ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని శివన్నారాయణ అనగానే మీకు ఉన్న టెన్షన్ లు సరిపోవా సర్ అని దాస్ అంటాడు. 

మరోవైపు దీప దగ్గరికి దశరథ్ వచ్చి ఎమోషనల్ అవుతాడు.  నీ కడుపులోని బిడ్డ, నువ్వు, సుమిత్ర ముగ్గురు బాగుండాలనే ఈ వ్రతం చేపించానని దీపకి కుంకుమ తీసుకొని వస్తాడు.  దీపకి కార్తీక్ బొట్టు పెడతాడు.  కాసేపటికి సుమిత్రకి మెలుకవ రావడంతో పారిజాతం, శివన్నారాయణ, కార్తీక్, దాస్, దశరథ్ అందరు వెళ్తారు. ఎలా ఉందని దశరథ్ అడుగగా.. నేను బాగున్నాను.. నా కూతురు ఎలా ఉందో చూసారా ‌అని సుమిత్ర అడుగుతుంది. చూశాను.. బాగుందని దశరథ్ చెప్తాడు. ఇక పారిజాతాన్ని కాసేపు ఇండైరెక్ట్ గా తిడతారు దశరథ్, కార్తీక్. ఇక అందరు కలిసి జ్యోత్స్న దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com