Home

»

Tv News

Illu Illalu Pillalu : పెళ్లికి నిరాకరించిన ప్రేమ.. నర్మదకు వల్లి దొరికిపోయిందా!

Sep 23, 2026 10:44AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లల Illu Illalu pillalu. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 586 లో... ప్రేమ దగ్గరకు ధీరజ్ వెళ్తాడు. పెళ్లి చేసుకుందాం, గొడవల్ని పక్కన పెట్టేద్దామని ప్రేమని బతిమాలతాడు ధీరజ్. నువ్వు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, నాకు మనసంటూ ఉండదా? నువ్వు మా కుటుంబ పరువు తీసేలా ప్రవర్తించావు.. నా కలల్ని, నమ్మకాన్ని చంపేశావు. నువ్వు మాట తప్పినంత ఈజీగా నేను మా అత్తకు ఇచ్చిన మాట తప్పలేనని అంటుంది. ఈ పెళ్లి జరగకపోతే జీవితాంతం దూరంగా ఉండాలని ధీరజ్ అనగానే ఏడుస్తూ హత్తుకుని.. సారీ, వెళ్లి మామయ్యకు చెప్పు అంటూ వెళ్లిపోతుంది ప్రేమ. ఇదంతా మేడపై నుంచి అమూల్య, విశ్వ ఇద్దరు చూస్తుంటారు.

 

ఇంట్లో వల్లి.. పెళ్లి కల వచ్చేసిందే బాలా, అది జరగనే జరగదు కదే బాలా" అంటూ డ్యాన్స్ చేస్తూ రూంలోకి రాగానే నర్మద బోర్డుపై వల్లి, ఇడ్లీ, భాగ్యం ఫోటోలు గుచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ కనిపిస్తుంది. ధీరజ్, ప్రేమలను నేను విడగొట్టడం ఏంటి చెల్లాయ్ అని వల్లి నటిస్తుండగా నర్మద.. మీ మాయమశ్చింద్రా మమ్మీ డాడీని మోపిదేవికి ఎందుకు పంపించావని నిలదీస్తుంది. తెలీదని వల్లి అనగానే లాగిపెట్టి కొడుతుంది. కాల్ లిస్ట్ డేటా ఉందని.. ప్రేమ, ధీరజ్ వెళ్లిన రోజే మీ అమ్మానాన్నలు ఎందుకు వెళ్లారు, భద్రావతికి పెళ్లి విషయం నువ్వే చెప్పావా అని నర్మద అడగ్గా.. భద్రావతితో నేను ఫోన్ లో మాట్లాడానని ప్రూఫ్ చూపించమని వల్లి నోరు జారి దొరికిపోతుంది. భద్రావతితో నువ్వు మాట్లాడావని నేను అనలేదే అని నర్మద అనగానే వల్లి షాక్ అవుతుంది.

 

అప్పుడే పెన్ స్టాండ్ పగిలి అందులోని వల్లి సీక్రెట్ సిమ్ కార్డు కింద పడుతుంది. భద్రావతితో దొంగచాటుగా మాట్లాడే దొంగ సిమ్ అని వల్లి కంగారుపడి దాచేస్తుంది. ఆ తర్వాత నర్మద వల్లితోనే నిచ్చెన మోపించి భద్రావతి ఇంటికి తీసుకెళ్లి.. ప్రేమను తీసుకురా అని బాల్కనీలోకి దూకమంటుంది. అక్కడ భద్రావతి ఎదురుపడి.. ఎందుకు వచ్చావని అడుగుతుంది. ప్రేమ కదలికలను జాగ్రత్తగా చూసుకోండి అని హెచ్చరించడానికి వచ్చానని వల్లి బిల్డప్ ఇవ్వగా.. నా తమ్ముడు తిరుపతి విషయంలో మీరు చేసిన మోసం చూశాక నిన్ను నమ్ముతానా అని ఎడాపెడా కొడుతుంది. దెబ్బకు వల్లి ఏడుస్తూ పారిపోతుంది. ఆ తర్వాత శారదంబ తిరుపతి, సుకన్య దగ్గరకు వెళ్లి చిన్న కోడలికి బంగారం ఇచ్చి, రామరాజు పెళ్లి ఛాలెంజ్ గురించి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com