Home

»

Tv News

Karthika Deepam2: మాలినికి కార్తీక్, దీప వార్నింగ్.. సూరజ్ ఏం చేయనున్నాడు!

Sep 23, 2026 10:36AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -785 లో.....బాబాయ్ చావుని అడ్డుపెట్టుకుని ఎన్ని ఘోరాలు చేస్తావ్ పిన్ని అని మాలినిని నిలదీస్తాడు కార్తీక్. దానికి మాలిని.. నా కొడుకు పరిస్థితి నీకు వచ్చి ఉంటే నా బాధ ఏంటో తెలిసేదని అంటుంది. నీ కొడుకు పరిస్థితి నాకు వచ్చి ఉంటే అని అనాల్సిన పనిలేదు పిన్నీ.. అంతకుమించిన బాధనే మిగిల్చారు. తండ్రి చచ్చిపోవడం వేరు, తల్లి అవిటిది అవ్వడం వేరు. తరువాతి తరాలకు ఉపయోగపడాలని మొక్కలు నాటుతారు కానీ నువ్వు విషాన్ని నాటావ్. ఆ విషం పెరిగి చెట్టు అయింది.. ఆ చెట్టే నీ కొడుకు అంటూ కార్తీక్ ఆవేశపడతాడు.

 

ఆ తర్వాత దీప కల్పించుకుని.. జరగదు అత్తా.. మేం ఉండగా నువ్వు అనుకున్నది జరగదు. లాక్కోవడంలోనే గెలుపు ఉందనుకుంటే పొరపాటే. శివన్నారాయణ ఆస్తులు లాక్కోవడానికి కారణమైన ఆ సంతకాలు పక్కనుండి పెట్టించింది నేనే. వాళ్లు నన్ను నమ్మారు.. నేను సూరజ్ ని నమ్మాను. మా నమ్మకాన్ని నిట్టనిలువుగా పాతేశారని ఫైర్ అవుతుంది. దీంతో మాలిని అలర్ట్ అయి.. ఆ ఇంటి కోడలు అవ్వడం అది చేసుకున్న పాపం, ఇలా జరిగిందంటే అది శివన్నారాయణ తలరాత అని అంటుంది.

 

ఇకపై అలా జరగదు పిన్నీ, ఇప్పటివరకు ఒక కార్తీక్ నే చూశావ్.. ఇకపై మరో కార్తీక్ ని చూస్తావ్. నా వాళ్లకి కష్టం కలగనంత వరకే నేను శాంతమూర్తిని.. కష్టం కలిగిందంటే నేను రుద్రమూర్తిని. శివన్నారాయణ పని అయిపోయిందని సంబరాలు చేసుకుంటున్నావ్ కదా.. ఆయన చుట్టూ కంచుకోట నిర్మిస్తానంటూ కార్తీక్ మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. 

 

బయటకు వస్తుంటే సూరజ్ ఎదురవుతాడు. ఆస్తులన్నీ లాగేసుకుని మా తాత కుటుంబం నడిరోడ్డులో అడుక్కుంటే కానీ తృప్తిగా ఉండదా.. ఆడపిల్ల మనసుతోనే ఆడుకున్నావ్ అనుకున్నా.. అందరి జీవితాలతో ఆడుకుంటావని తెలియలేదని కార్తీక్ కోప్పడతాడు. నువ్వు కూడా మోసపోతున్నావ్ సూరజ్.. బయట వాళ్ల దగ్గర కాదు.. నీ కన్నతల్లి దగ్గరే. నా భార్య ప్రాణాలు కాపాడావ్, అందుకు థాంక్స్. నువ్వు కాపాడింది ఒక్క ప్రాణం కాదు, రెండు ప్రాణాలు. ఇదీ సూరజ్ అంటే. కానీ ఆ సూరజ్ ని చంపేసి మాలిని కొడుకుగా క్రూరంగా మారావంటూ దీప కూడా అంటుంది.

 

చివరగా దక్షిణామూర్తి.. అసలు నువ్వు మనిషివేనా? నా కూతుర్ని రోడ్డు మీదకు తెస్తావా అని మాలినిపై అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీకు అవమానం జరిగినా నేనేం చేయలేకపోతున్నా, బతకడం కంటే చచ్చిపోవడమే మేలు అని మాలిని అనగానే సూరజ్ వచ్చి మరో చావు ఈ ఇంటికి అవసరం లేదమ్మా అని అంటాడు. దీంతో దక్షిణామూర్తి కరిగిపోయి.. వద్దమ్మా అలాంటి మాటలు అనొద్దని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

[Karthika Deepam 2, Karthika Deepam 2 Episode 785, Star Maa Serial, Karthik, Deepa, Malini, Suraj, Shivannarayana, Dakshinamurthy, Telugu Serial, Property Dispute]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com