జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' . ఈ సీరియల్ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. శనివారం నాటి ఎపిసోడ్ -360 లో ఏం జరిగిందంటే...రుద్ర దగ్గరికి గంగ వెళ్లి.. నన్ను క్షమించండి అని అంటుంది. దీంతో రుద్ర ఆమెపై కోప్పడతాడు. ఏంటే చెల్లి, బావని విసిగించకు. అసలే బావ నీపై చాలా కోపంగా ఉన్నాడని రంగా అంటాడు. అదంతా ఇషిక, వీరు చూసి నవ్వుకుంటారు.
ఆ తర్వాత .. చాలా థాంక్స్ గంగ, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యేలా చేసినందుకని ఇషిక, వీరుతో శకుంతల అంటుంది. విశ్వ క్షమిస్తే రుద్ర ఈజీగా క్షమిస్తాడని వీరు అంటాడు. అప్పుడే పెద్దసారు వస్తాడు, గంగ ఏదో చేసిందని తనని తప్పు పట్టడం సరికాదని చెప్తాడు.మరోవైపు జయ బాక్సింగ్ చేస్తూ గంగ ఫోటోని చూస్తూ కొడుతూ ఉంటుంది. అది లక్ష్మి చూసి సుధాను తీసుకొని వస్తుంది. ఏంటి జయ అలా చేస్తున్నావని అడుగుతుంది. మనం ఎవరిపైనైనా గెలవాలి అనుకుంటే ఇలా చేయాలి.. అప్పుడే మనకి కసి పెరుగుతుందని జయ అంటుంది.
మరోవైపు బాక్సింగ్ గ్లౌస్ ని గంగ ఒక దగ్గర పెట్టి కిచెన్ లోకి వెళ్తుంది. అవి చూసి ఇషిక డస్ట్ బిన్ లో పడేద్దామని వెళ్తుంటే గంగ ఆపుతుంది. ఇషికను కొట్టబోతుంటే శకుంతల వచ్చి ఆపుతుంది. అప్పుడే పెద్దసారు వచ్చి ఈ గ్లోవ్స్ తీసుకొని వెళ్లి ప్రాక్టీస్ చెయ్ అని చెప్తాడు.ఆ తర్వాత రుద్ర దగ్గరికి గంగ వచ్చి సర్ మీరు నేను చేసింది తప్పు అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Jayam Serial Today Episode 360, Zee Telugu Jayam, Jayam Serial Update, Jayam Telugu Serial, Jayam Episode]




