
స్టార్ మా టీవీలో ప్రసారవుతున్న సీరియల్ కార్తీక దీపం 2 Karthika Deepam2.ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 779 లో.......శివన్నారాయణ సామ్రాజ్యాన్ని మాలిని పూర్తిగా కూల్చేస్తుంది. కంపెనీలు, ఆస్తులు, షేర్లు లాగేసుకోవడంతో శివన్నారాయణ బాధపడుతుంటే ఉద్యోగులు వచ్చి.. మా షేర్లు అమ్మేసి మా పొట్ట కొట్టారని నిలదీస్తారు. గొడవలో దశరథ్ గిరిని కొట్టగా గిరి తిరగబడి శివన్నారాయణని నెట్టేస్తాడు. అప్పుడే వచ్చిన మాలిని.. నిన్నటి వరకూ నీ కింద ఉన్నవాళ్లే నెట్టేశారు, శత్రువుకి నీడ కూడా ఉండకూడదు..ఇంటి దగ్గర నీకు బంపరాఫర్ ఉందని చెప్పి వెళ్లిపోతుంది.
ఇంటి దగ్గర బ్యాంక్ వాళ్లు రెడీగా ఉంటారు. మాలిని మేడమ్ రూ.20 కోట్లు అప్పు తీసుకుంది.. షూరిటీ మీరే పెట్టారు.. ఇప్పుడే కట్టాలి లేదంటే ఇల్లు జప్తు అని నోటీసు చూపించి ఇంట్లోని బంగారం, కార్డులు, మొబైల్స్, కార్లు అన్నీ లాక్కుని కట్టుబట్టలతో బయటకు గెంటేస్తారు. నమ్మకం చాలా ఖరీదైనది.. సంతకం పెట్టి సర్వం పోగొట్టుకున్నామని శివన్నారాయణ అన్నాడు.
మరోవైపు హాస్పిటల్ లో దీప కొనఊపిరితో ఉంటుంది. బయట జ్యోత్స్న.. దీపని ఎందుకు కాపాడావని సూరజ్ తో గొడవపడుతుంది. దీప నా వదిన, రుణం తీర్చుకోవడం నా బాధ్యత అని సూరజ్ అంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి.. దీపకి ఏమైందని అడగ్గా జ్యోత్స్న.. కండిషన్ సీరియస్, దీప బ్రతకపోవచ్చు, ఒకవేళ బ్రతికినా కడుపులో బిడ్డ అని చెప్పడంతో కార్తీక్ గుండె ముక్కలు అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






