
గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జగతి అలియాస్ జ్యోతి పూర్వజ్ సోషల్ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తను నటిస్తున్న 'కిల్లర్' అనే సినిమాలోని 'ఫైర్ అండ్ ఐస్' ఫస్ట్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ లో మాట్లాడిన ఆమె మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైడ్ గా వెళ్ళిపోయింది. ఇంట్లో ఒక్కొక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇష్టం అంటే టాకింగ్ రైట్స్ అని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఇంకొకర్ని అనడం కాదు.. రేపు నీ ఇంట్లో అమ్మాయికి ఏదన్నా అయితే నువ్వు మాట్లాడతావా.. రేపు నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నువ్వు మాట్లాడతావా అంటూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారిపై ఫైర్ అయింది.
అంతేకాదు మొబైల్ వాడకం పై కూడా తన అభిప్రాయాన్ని చెప్పింది జ్యోతి. మొబైల్ లో పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. ఎమర్జెన్సీలో ప్రాణం పోతుందంటే కాల్ చేయాలంటే మొబైలే కావాలి. కానీ అందులో నెగెటివ్ కూడా ఉంది. నా ఇంట్లో నా మనసుని నేను ఆపగలిగితే నన్ను చూసి ఎవరైనా మారతారేమోనని అనుకుంటా.. కానీ చాలా కష్టంగా ఉంది సర్ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడున్న జనరేషన్ లో మనుషులు ఎక్కడ తప్పు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని ఆమె అన్నారు. స్వచ్ఛ భారత్ ని ఉదాహరణగా తీసుకుంటూ మనుషుల మెంటాలిటీపై సెటైరికల్ గా మాట్లాడింది. స్వచ్ఛ భారత్ అంటారు, నేనే తినేసి, ఎక్కడపడితే అక్కడ నేనే పడేస్తే అది ఎక్కడ స్వచ్ఛ భారత్ అవుతుంది.. కానీ నేను సోషల్ మీడియాలో స్వచ్ఛ భారత్ ని ప్రమోట్ చేస్తా.. ఎందుకంటే నేను పాపులర్ అవుతాను. ఇలాంటి మెంటాలిటీ జరుగుతుంది మనుషుల్లో... గ్యాడ్జెట్స్ ని, మీడియాని వాడేసుకుంటున్నారు అంతే అని జ్యోతి ఘాటుగా విమర్శించింది.
మనం వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళ మనసుని క్లీన్ చేయలేం. We can't change people's mentality. I have to be correct. If I am doing right then I don't need to think about this world అంటూ తను కరెక్ట్ గా ఉంటే చాలు, ప్రపంచం గురించి పట్టించుకోనవసరం లేదని చెప్పింది. ఫైర్ అండ్ ఐస్ లాంఛ్ ఈవెంట్ లో ఆమె చేసిన ఈ కామెంట్స్ కి నెటిజన్లు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






