Home

»

Tv News

Illu illalu pillalu: ప్రేమను వదిలేసిన ధీరజ్.. ఫారిన్ పంపిస్తానన్న సేనాపతి!

Aug 20, 2026 9:23AM

స్టార్  మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 554 లో.. నువ్వు నాకు వద్దు అన్న ధీరజ్ మాటలను గుర్తు చేసుకుంటూ ప్రేమ తీవ్రంగా బాధపడుతూ ఉంటుంది. ఇదే సమయంలో భద్రవతి ఆమె దగ్గరకు వచ్చి సానుభూతి నటిస్తూ మరింత విషం నింపుతుంది. ధీరజ్ రోజు రోజుకీ నిన్ను అవమానిస్తున్నాడు. ముందు ముందు ఇంకెంత బాధ పెడతాడో అని భయంగా ఉంది. అర్థం చేసుకోలేని వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా సంతోషంగా ఉంటావమ్మా?” అంటూ ప్రేమను భద్రవతి రెచ్చగొడుతుంది. మరోవైపు ధీరజ్ కూడా ఒంటరిగా కూర్చుని ప్రేమ తనను అర్థం చేసుకోకపోవడంతో బాధపడుతుంటాడు. మరోవైపు ఆనందరావు రైస్ మిల్లుకు వెళ్లాలని ఇష్టపడకుండా తన పాత ఇడ్లీ వ్యాపారం మీదే ప్రేమ ఉందంటాడు. అదే సమయంలో మూడు లక్షల అప్పు తీసుకున్న ఫైనాన్షియర్ చింతామణి వారి ఇంటికి వస్తుంది. వడ్డీతో కలిపి ఆరు లక్షలు ఇప్పుడే ఇవ్వాలి. లేదంటే మీ కూతురి అత్తింటికి వెళ్లి మీ చరిత్ర మొత్తం చెప్తానని బెదిరిస్తుంది.

 

చింతామణి సాయంత్రం వరకు ఆరు లక్షలు ఇవ్వాలని గడువు పెట్టడంతో భాగ్యం, ఆనందరావు భయపడిపోతారు. చివరికి భాగ్యం ఒక ఐడియా చెప్తుంది. రామరాజు అన్నయ్య ఊర్లో లేడు కదా.. ఇదే మంచి అవకాశం. రైస్ మిల్లులో ఐదు లక్షలు కొట్టేసి తీసుకురా. లేకపోతే నీ కూతురి కాపురమే కూలిపోతుందని భాగ్యం అనగానే ఇడ్లీ మొదట భయపడినా చివరికి ఆనందరావు ఒప్పుకుంటాడు. మరోవైపు వల్లి ప్రేమ, ధీరజ్‌ల గొడవలోకి దూరి ప్రేమ చేసిన తప్పును పదేపదే ప్రస్తావించడంతో చందు ఆమెను కొడతాడు. ధీరజ్ కూడా ప్రేమ తనను నమ్మకపోవడంతో బాధపడతాడు. తన కళ్లల్లో నీళ్లు రాకుండా చూసుకున్నాను. నా తప్పు కాకపోయినా నన్నే నిందిస్తోంది. ఇక తన చుట్టూ తిరిగి బతిమిలాడే ఓపిక నాకు లేదు. నా లైఫ్ నేను చూసుకుంటాను.. దాని జీవితం దాని ఇష్టం అని ధీరజ్ వెళ్లిపోతాడు. ధీరజ్ నిర్ణయం విన్న వల్లి, భద్రవతికి ఫోన్ చేసి.. మంట కాదు.. కార్చిచ్చు అంటుకుంది. దాదాపు కాదు.. పూర్తిగా అయిపోయినట్టే అని సంతోషంగా చెప్తుంది. 

 

ఇక ప్రేమ బాధను చూసి సేనాపతి తట్టుకోలేకపోతాడు. తన కూతురు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని, కానీ ఇప్పుడు ఆమెను ఇలా చూడటం తనకు భరించలేకపోతుందని చెప్తాడు. నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటే నీకు ఏమవుతుందోనని భయంగా ఉంది. జరిగినవన్నీ మర్చిపోవడానికి, నిన్ను ఈ బాధ నుంచి దూరంగా ఉంచడానికి నిన్ను ఫారెన్ పంపిస్తాను. నిన్ను బాధపెట్టే మనుషులు నీ కంటికి కనిపించకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వెళ్తావా అని సేనాపతి అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com