Home

»

Tv News

Agnipariksha season2 : రోహిత్ కూల్‌నెస్, గౌరి ధైర్యం, భాగీ అల్లరితో అదరగొట్టిన ఎపిసోడ్!

Aug 19, 2026 10:03AM

బుల్లితెరపై అత్యంత ఆసక్తికరంగా మారిన రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రసారమవుతున్న  అగ్నిపరీక్ష సీజన్ 2  సెలెక్షన్ ప్రక్రియ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్ అవుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో రోహిత్ నాయుడు ఒకడు. ఇతను పూర్తి కూల్ పీస్. షో ఎంజాయ్ చేయడానికి వచ్చా అని రోహిత్ అనగానే అభిజిత్ వెంటనే.. నువ్వు కాదు, ఆడియన్స్ ఎంజాయ్ చేయాలని క్లాస్ తీసుకున్నాడు. బిందు స్వీట్ ఇచ్చి మూడు సార్లు మొహం మీద నీళ్లు కొట్టినా కూడా రోహిత్ సైలెంట్ గానే ఉన్నాడు. ఆమెకి ఏదో రీజన్ ఉంటుంది, నన్ను రెచ్చగొట్టాలని చూస్తుందని సమాధానమిచ్చాడు. శ్రీముఖి డేర్ ఇచ్చి నీళ్లు కొట్టమంటే.. ఆ పని చేయనని స్ట్రైట్ గా చెప్పేసాడు. స్టాండ్ తీసుకోలేదని బిందు, నవదీప్ రెడ్ ఇచ్చినా, అభిజిత్ మాత్రం.. కాం అండ్ కంపోజ్డ్ గా ఉండటం మంచిదే అని గ్రీన్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు.

 

 ఆ తర్వాత వచ్చిన గౌరి త్రినేత్ర అందరిని షాక్ చేసింది. ఇంటర్ వరకు నేను అబ్బాయిని, ఆ తర్వాత అమ్మాయిని. ట్రాన్స్ గా ఎన్నో అవమానాలు పడ్డా అని ఓపెన్ గా చెప్పింది. నవదీప్ వెంటనే.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ అన్నావ్, మళ్లీ అందరికీ తెలుసంటున్నావ్, ఇది కట్టు కథనా అని క్వశ్చన్ చేసాడు. బిందు, నవదీప్ డౌట్ పడ్డా, అభిజిత్ మాత్రం ఆమె ధైర్యానికి గ్రీన్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. సొసైటీ లో ఫేస్ చేసే కష్టాల గురించి మాట్లాడినందుకు ఆమెకు సపోర్ట్ వచ్చింది.

 

 లాస్ట్ లో వచ్చిన భాగి తుల్లూరు మాత్రం ఫుల్ జెన్యూన్ వైబ్ ఇచ్చింది. నెల్లూరు యాస, అమాయకమైన మాటలు, పెళ్లి కథ చెప్తూ జడ్జ్ లని నవ్వించింది. నవదీప్ భర్తలా యాక్ట్ చేస్తే ఆమె స్కిట్ కూడా చేసి చూపించింది. అభిజిత్, బిందు ఇద్దరూ నిజంగానే ఉందని గ్రీన్ ఇచ్చారు. కానీ నవదీప్.. డైరెక్ట్ గా పంపించలేం, మిగతా వాళ్లతో కాంపిటేట్ అయి సత్తా చాటుకోమని రెడ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టాడు. మొత్తానికి ఈ ముగ్గురిలో రోహిత్ కూల్ నెస్, గౌరి ధైర్యం, భాగి అమాయకత్వం.. మూడూ వేరు వేరు ఫ్లేవర్స్ లా ఉన్నాయి. మరి వీరిలో ఎవరు టాప్-15 కి వెళ్తారో చూడాలి మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com