Home

»

Tv News

Podharillu: సైకిల్ పై మహా,చక్రి సందడి.. మనీషా విషయంలో మాధవ షాక్!

Aug 20, 2026 9:28AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  పొదరిల్లు  సీరియల్ 183వ ఎపిసోడ్‌లో మహా, చక్రిల సైకిల్ రైడ్ ఎంతో సరదాగా సాగింది. ఊరి అందాలను ఆస్వాదిస్తూ ఇల్లు ఎలా ఉండాలి అనే విషయాలపై వారు ముచ్చటించుకున్నారు. ఇంతలో మార్గమధ్యలో ఆకతాయిలు మహాని ఏడిపించగా, ఊరి పెద్ద దుర్గ ప్రసాద్ వారిని చితకబాదాడు. మన ఊరికి అతిథులను ఏడిపిస్తారా అంటూ దుర్గ ప్రసాద్ కోపంగా వారిని బెదరిస్తాడు.

 

ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా, మనీషా అందరికీ వడ్డిస్తుంది. మహాపై చక్రి చిన్నపాటి సరదా కౌంటర్లు వేయడం, పెద్ది అందరితో కలిసి జోకులు వేయడం నవ్వులు పూయించింది. ఆ సమయంలో మనీషా అందరికీ భోజనం వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీరు వంట చేస్తారా అని మహా అడుగగా..భయపడొద్దు, నేను చేయలేదు.. ఆయనకు సాయం చేశానంతే అని మనీషా అంటుంది.

 

గాయత్రి ఊహించని ట్విస్ట్ ఇస్తూ, మాధవ్ కోసం మనీషాను సంబంధం చూశామని అనడంతో మాధవ  షాక్‌కు అవుతాడు. తప్పు.. మన సాయం కోరి వచ్చిన వ్యక్తిని అలా ఊహించుకోకూడదని మాధవ అంటాడు. మంచి అమ్మాయి.. నిన్ను బాగా చూసుకుంటుందని గాయత్రి సమర్థించుకుంది. నాకు పెళ్లా అని పెద్ది ఆశ్చర్యపోయాడు. మరోవైపు శేఖరం ఇంటికి చేరుకుని తన పెంపకం గురించి, తను చేసిన తప్పుల గురించి కూతురు శైలుతో మాట్లాడుతూ తీవ్రంగా మథనపడ్డాడు. నేను ఏమైనా తప్పు చేశానా అమ్మా అని శేఖరం అడిగాడు. నువ్వు ఎందుకు తప్పు చేస్తావ్ నాన్నా అని శైలు తండ్రిని ఓదార్చింది. మరి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశావ్ అమ్మా అంటూ శేఖరం తనలో తనే కుమిలిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com