Home

»

Tv News

Illu illalu pillalu: తిరుపతి, సుకన్య పెళ్లి గొడవ.. ఇంటి నుంచి గెంటేసిన వేదవతి!

Sep 15, 2026 12:19PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  ఇల్లు ఇల్లాలు పిల్లలు  Illu illalu pillalu . ఈ సీరియల్ సోమవారం  నాటి ఎపిసోడ్ 579లో..  ఎన్నో రోజులుగా ప్రేమలో ఉన్న తిరుపతి, సుకన్య ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని తెలిసి లేచిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి ధీరజ్, ప్రేమలు పెద్దలుగా నిలబడి దగ్గరుండి చేయించారు. పెళ్లి బట్టలతో, దండలు, పసుపు బొట్టుతో తిరుపతి, సుకన్య ఇంటికి వస్తారు. వారిని చూడగానే ఇంట్లో అందరి ముఖాల్లో షాక్ ఆ తర్వాత కోపం కనిపించాయి. మొదట వేదవతి..‌అంటే అన్నానని అంటారు కానీ అనే తన స్టైల్ లో సుకన్యను బల్లక్కాయ్ అంటూ చేయి ఎత్తింది. ఇలా లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి నీకు సిగ్గు లేదా? మా పరువు తీశావ్ కదే అని అరుస్తుంది. అక్కడే ఉన్న శ్రీవల్లి..‌చూడండి అత్తయ్యా, వీళ్లు ఎంత పని చేశారో అంటుంది. అప్పుడే మెట్ల మీద నుంచి భద్రావతి, సేనాపతి, వారి ఫ్యామిలీ ఆవేశంగా దిగారు. భద్రావతి వస్తూనే.. కొట్టాల్సింది ఆ ఇద్దరిని కాదు, ఈ ధీరజ్ గాడిని. వీడినే నరికేయాలంటూ ధీరజ్ మీదకు వెళ్లింది.

 

 

భద్రావతి అలా అనగానే వేదవతి  షాక్ అవుతుంది. ఏంటి..‌ఈ పెళ్లి చేయించింది ధీరజా అని అడుగుతుంది. అవును, నీ కొడుకే మా తమ్ముడిని తీసుకెళ్లి దొంగచాటుగా పెళ్లి చేయించాడని భద్రావతి చెప్తుంది. దీంతో భద్రావతి నోరు అదుపులో పెట్టుకో, వీళ్లు లేచిపోతే నా కొడుకును అంటావేంటని వేదవతి ఫైర్ అవుతుంది. అరేయ్ చిన్నోడా, నిజం చెప్పు, పెళ్లి నువ్వే చేయించావా అని ధీరజ్ ని రామరాజు నిలదీస్తాడు. అవును నాన్నా, వాళ్లు ప్రేమించుకున్నారు, వేరే దారి లేదని ధీరజ్ ధైర్యంగా ఒప్పుకుంటాడు. అప్పుడే సేనాపతి.. ఇదంతా నీ కుట్రే రామరాజు.. మా కుటుంబం మీద పగతో జమీందార్ కొడుకైన నా తమ్ముడికి కూటికి గతిలేని దానితో పెళ్లి చేశావని నింద వేస్తాడు. నేను చేయలేదని రామరాజు చెప్పబోతే వినడు. అన్నయ్య, బావకు ఏం తెలీదు, నేనే చేసుకున్నానని చెప్పబోతాడు. కానీ భద్రావతి కోపం ఆపుకోలేక తిరుపతిని చెంపపై కొడుతుంది. మన స్థాయికి తగ్గ అమ్మాయిని చూస్తే ఈ పనిమనిషి కూతురిని చేసుకుంటావా? నిశ్చితార్థం నుంచి తీసుకెళ్లి పెళ్లి చేస్తావా అని తిడుతుంది.

 

ధీరజ్ కు ఆ మాటలకు కోపమోస్తుంది. మీ కుటుంబానికి లేచిపోయి పెళ్లి చేసుకునే అలవాటుందని అంటావేంటి.. మా కుటుంబాన్ని అనాల్సిన అవసరం లేదని భద్రావతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ధీరజ్. కానీ వేదవతి మాత్రం ధీరజ్ నే తప్పుపడుతుంది. వెంటనే ధీరజ్ ని కూడా కొడుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, వాళ్ల జోలికి వెళ్లొద్దని, ఇప్పుడు చూడు ఏం జరిగిందోనని అరుస్తుంది. ఇద్దరు అక్కచెల్లెళ్లు అయిన వేదవతి, భద్రావతి ఒక్కసారిగా తిరుపతి, సుకన్యలపై ఏకమయ్యారు. ఇదే అదునుగా శ్రీవల్లి లోలోపల సంతోషపడింది. నా మాట వినకుండా పెళ్లి చేసుకున్న నీకు ఈ ఇంట్లో చోటు లేదు, బయటకు వెళ్లని తిరుపతిని, సుకన్యను పెళ్లి బట్టలతోనే బయటకు గెంటేస్తుంది వేదవతి. ఇక నుంచి నువ్వు నా తమ్ముడు కాదు,చచ్చిపోయావనుకుంటాని భద్రావతి తెగతెంపులు చేసుకుంటుంది. ఒంటరైన తిరుపతి సుకన్య చేయి గట్టిగా పట్టుకుని కన్నీళ్లతో గడప దాటాడు. వెనకాల రామరాజు, ప్రేమ కన్నీళ్లు పెట్టుకున్నారు. ధీరజ్ మాత్రం.. మీరు భయపడకండి, నేనున్నా, మా ఇంటికి వెళ్దామని వారికి అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com