Home

»

Tv News

Bigg Boss 10 Day 8 : రెండో వారం నామినేషన్స్ లో పదకొండు మంది కంటెస్టెంట్స్.. ముగ్గురు మాత్రమే సేఫ్!

Sep 15, 2026 12:26PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో వారం మొత్తం ఆట ఎలా ఉన్నా వీకెండ్ ఎపిసోడ్ కోసం ఎలా ఎదురుచూస్తారో.. అలాగే సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఎందుకంటే వీకెండ్ లో నాగార్జున ఎవరిని తిడతారు ఎవరిని పొగడతారనే దాన్ని బట్టే సోమవారం నామినేషన్స్ ఆధారపడి ఉంటాయి.

 

గతవారం అంటే ఫస్ట్ వీక్ లో డైరెక్ట్ నామినేషన్స్ లేవు. హౌస్ మొత్తాన్ని బిగ్ బాస్ నామినేట్ చేశారు. అందుకే పెద్దగా హీటెడ్ లేకుండా సాగింది. కానీ రెండో వారం మాత్రం అసలు సిసలైన నామినేషన్స్ జరిగాయి. తొలివారంలోనే హౌస్ లో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి.. హీట్ మూమెంట్స్ చాలానే జరిగాయి. దీంతో రెండో వారం నామినేషన్స్ లో  ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. రోహిత్, త్రిగుణ్, దేబ్జానీ, ఝాన్సీ, కృష్ణుడు, వర్షిణి,శ్రిష్టి, ముఖేష్, షాలినీ, సుధీర్, రాం ప్రసాద్ .. మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ముగ్గురు మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారు‌.

 

జబర్దస్త్ నరేష్, అమన్, వంశీ.. వీళ్లు ముగ్గురూ ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. అందులో నరేష్ ని ఈ వారం నాగార్జున తెగపొగడడం వల్ల ఎవరు నామినేట్ చేయడానికి ధైర్యం చేయలేదనిపిస్తోంది. ప్రతీ సీజన్ లోనూ వీకెండ్ లో నాగ్ ఎవరిని పొగడతారో వాళ్లు సేఫ్ అవుతారు.. ఎవరిని తిడతారో వాళ్లు నామినేట్ అవుతారు. అదే ఫార్ములా ఇక్కడ కూడా జరిగింది. మరి ఈ 11 మందిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు.. రోహిత్ కి ఎక్కువ ఓట్లు పడతాయా, త్రిగుణ్ కి పడతాయా అనేది ఆసక్తిగా మారింది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com