
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు Illu illalu pillalu . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 556లో.. ఇంట్లో ఎవ్వరు లేని టైంలో చందు దృష్టిని మరల్చుతుంది భాగ్యం. ఇలా చూడు అంటూ ఏదో సాకు చెప్పి అతన్ని బిజీ చేస్తుంది. అదే అదునుగా బీరువాలో ఉన్న డబ్బులు తీసుకుని దాచిపెడుతుంది. చందుకి ఏమీ అనుమానం రాకుండా చాలా తెలివిగా నటిస్తుంది. తర్వాత డబ్బులు ఎవరు తీసుకున్నారోనని అందరితో గొడవ కూడా పెడుతుంది.
మరోవైపు విశ్వ ఇంట్లో అత్తగారితో మంచిగా మాట్లాడతాడు. ఆమెకు కావాల్సిన పనులన్నీ తనే చేసి పెడతాడు. అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటానంటూ ఆమె మనసు గెలుచుకుంటాడు. భాగ్యం చేస్తున్న తప్పులను విశ్వ గమనిస్తున్నా.. వెంటనే బయటపెట్టకుండా సైలెంట్ గా ఉంటాడు.
అమూల్యతో విశ్వ కూడా దగ్గరగా మాట్లాడతాడు. ఆమెకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాడు. మనం నిజాన్ని దాచకూడదని అమూల్యకు ధైర్యం ఇస్తాడు విశ్వ. దీంతో అమూల్య కూడా విశ్వ మాట విని అతనికి సపోర్ట్ చేయడానికి రెడీ అవుతుంది. ఇంట్లో తనకు ఒక లైన్ క్లియర్ చేసుకుంటాడు విశ్వ. భాగ్యం దొంగతనం చేసినట్టు ఎవరికీ తెలియదు. కానీ విశ్వ మాత్రం అన్ని గమనిస్తాడు. చివర్లో అబద్ధాలు ఎక్కువ రోజులు దాగవు భాగ్యం అన్నట్టుగా విశ్వ ఉంటాడు. డబ్బులు పోయాయని తెలిసి చందు ఏం చేస్తాడు.. భాగ్యం దొంగతనం బయటపడుతుందా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






