Brahmamudi: డీఎన్ఏ టెస్ట్ భయంతో వణికిపోతున్న రేఖ.. అసలు నిజం బయటపడుతుందా?
Aug 22, 2026 9:53AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi . ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 1117లో.. రాజు కోపంగా ఇంట్లోకి వస్తాడు. రేఖను ఒక మూలకు పిలిచి గట్టిగా నిలదీస్తాడు. DNA టెస్ట్ చేస్తే నీ అసలు రంగు అందరికీ తెలుస్తుంది రేఖ. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తావని అంటాడు. రాజు మాటలకు రేఖ ముఖం పాలిపోయింది.. చేతులు వణికిపోతాయి. నన్ను ఇలా ఇరుకున పెట్టకు రాజు. నా పరువు పోతుందని రేఖ బతిమాలుతుంది. నిజం దాచడానికి నువ్వు చేసిన ప్రతి పనికి లెక్క చెప్పాల్సిందే. ఈసారి ఎవరూ నిన్ను కాపాడలేరని బెదరించి అక్కడి నుండి వెళ్లిపోతాడు రాజు. దీంతో రేఖ టెన్షన్ తో ఎవరి దగ్గరికి వెళ్లి మాట్లాడాలో తెలియక ఇల్లంతా తిరుగుతుంది.
రాజు బెదిరింపులతో భయపడిన రేఖ వెంటనే ఇందు గదిలోకి వెళ్తుంది. కళ్లలో నీళ్లతో.. ఇందు తల్లి, నన్ను కాపాడు. నా పరువు, నా సంసారం నీ చేతిలోనే ఉంది. నన్ను వదిలేయకంటూ వేడుకుంది. DNA టెస్ట్ వద్దు, అది జరిగితే నేను బతకలేను. అందరూ నన్ను తప్పుగా చూస్తారని రేఖ ఏడుస్తుంది. అత్తయ్య, అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవు. నిజం ఏంటో అందరికీ తెలియాలి. నువ్వు చేసిన తప్పుకు మూల్యం చెల్లించాల్సిందే ఇందు అని క్లియర్ గా చెప్పేస్తుంది. ఇందు ఇలా మాట్లాడేసరికి రేఖకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఇందు కూడా సపోర్ట్ చేయడం లేదని అర్థమై మరింత కంగారు పడుతుంది.
ఇందు కూడా కాదనడంతో రేఖ చివరి ఆశగా భ్రమరం దగ్గరికి పరిగెత్తింది. "భ్రమరం, నువ్వు మంచి పిల్లవు కదా. నాకు హెల్ప్ చెయ్యి. నా జీవితం రోడ్డున పడుతుంది. నన్ను ఆదుకో" అంటూ ఆమె చేతులు పట్టుకుని బతిమాలుతుంది. రేఖ అలా కాళ్ల దగ్గర కూర్చోవడం చూసి భ్రమరం షాక్ అవుతుంది. అత్తయ్య, లేవండి. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు. నేను అబద్ధానికి సపోర్ట్ చేయలేను, అది నా నైజం కాదని భ్రమరం సూటిగా చెప్తుంది. ఎవరూ తనకు సపోర్ట్ చేయకపోవడంతో రేఖ ఒంటరిగా ఫీల్ అవుతుంది. నాకు దిక్కే లేదా అని మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్లిపోతుంది రేఖ. రాజు మాత్రం తన నిర్ణయం నుండి వెనక్కి తగ్గలేదు. అందరి ముందు.. రేపే DNA టెస్ట్ కి ఏర్పాట్లు చేస్తాను. ఎవరూ ఆపలేరు. నిజం ఏంటో రేపే తేలిపోతుందని గట్టిగా చెప్తాడు. రేఖ మాత్రం గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని కుర్చీలో కూర్చుని ఏడవడం మొదలుపెడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎవరు నాకు సహాయం చేస్తారని ఆలోచిస్తూ తల పట్టుకుంది. బయట అందరు రేఖ వైపు అనుమానంగా చూస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




