
ప్రేమ లాస్ట్ డే షూట్.. ఇక తను ఆ సీరియల్ లో కనపడదు.. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఏంటా వీడియో అంటే అన్షు రెడ్డి తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసిన ఓ వ్లాగ్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో అన్షు రెడ్డి నర్మద పాత్రలో నటిస్తుంది. ప్రేమ లావణ్య పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సీరియల్ లో ప్రేమ, నర్మద ల సిస్టర్ బాండింగ్ కి క్రేజీ ఫ్యాన్ బేస్ ఉంది.
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్' అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఈ సీరియల్ లో రామరాజు అలియాస్ ప్రభాకర్, వేదవతిలకి ముగ్గురు కొడుకులు. ఒక్కొక్కరు ఒక్కో టైమింగ్ తో ఫేమస్ అయ్యారు. చిన్నోడు ధీరజ్ తన భార్య ప్రేమ.. వీరిద్దరి జంటకి క్యూట్ ఆన్ స్క్రీన్ జంటగా పేరుంది. ఇక పెద్దోడు చందు భార్య శ్రీవల్లి. తను విలన్ గా లేడీ కామెడియన్ గా పేరు తెచ్చుకుంది. ఇక నడిపోడు సాగర్. అతని భార్య నర్మద. నర్మద పాత్రలో నటిస్తుంది అన్షు రెడ్డి. ఈ సీరియల్ లో ఆమె కట్టు బొట్టు చూస్తే అబ్బా భార్య అంటే ఇలా ఉండాలబ్బా అని సీరియల్ చూసేవాళ్లకి అనిపిస్తుంటుంది. ముఖ్యంగా సాగర్‌ని చూస్తే.. వీడు మామూలు లక్కీ కాదని కుళ్లుకుంటారు. అన్షు రెడ్డి తన నటనతో ఒకవైపు ఆన్ స్క్రీన్ మీద మెప్పిస్తుంటే మరోవైపు పర్సనల్ లైఫ్ లో నిత్యం వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంది.
అన్షురెడ్డికి యూట్యూబ్ లో నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉండగా, ఇన్ స్టాగ్రామ్ లో 992K ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తన యూట్యూబ్ ఛానెల్ లో 'prema last day shoot ' అనే వ్లాగ్ చేసింది. దీనిలో ప్రేమతో లాస్ట్ డే షూట్ పూర్తయ్యాక చేసినవన్నీ షేర్ చేసింది అన్షు రెడ్డి అలియాస్ నర్మద. ప్రేమతో తమ అనుభవాలని నర్మద, శ్రీవల్లి షేర్ చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ లో నటించిన మిగతా నటీనటులు ప్రేమతో సరదగా గడిపిన జ్ఞాపకాలని షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రేమతో కేక్ కట్ చేపించారు. ఇక తను రాదని తెలిసి శ్రీవల్లి, నర్మద ఏడ్చేశారు. మరి 'ఇల్లు ఇల్లాలు సీరియల్' లో ప్రేమ నటన మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.




.webp)

