
బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ 10 లో చాలామంది కొత్త కంటెస్టెంట్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో డీమన్ పవన్ కూడా ఒక కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్ లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ తర్వాత రకరకాల షోస్ లో కనిపిస్తున్నాడు. ఇక కూకు విత్ జాతిరత్నాలు షోలో కూడా కంటెస్టెంట్ గా వచ్చాడు. ఇక బిగ్ బాస్ లో రీతూ చౌదరితో కలిసి చాలా అల్లరి చేసాడు. ఇప్పుడు డీమన్ పవన్ మదర్స్ డే సందర్భంగా వాళ్ళ అమ్మ కోసం ఒక కార్ కొని ప్రెజెంట్ చేసాడు.
ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకున్నాడు. ఇక వాళ్ళ అమ్మకు ఏ కలర్ కార్ కావాలో కనుక్కున్నాడు. ఆవిడ మెరూన్ అనేసరికి అదే కలర్ కార్ తీసుకుని కేక్ కట్ చేసి తినిపించి ఆవిడని కార్ లో కూర్చోబెట్టాడు. ఇక టొయోటా హైరైడర్ కార్ ని ఓపెన్ చేసి చూపించాడు. ఈ కార్ కాస్ట్ సుమారు 16 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంది. ఇక ఈ కార్ ప్రెజెంట్ చేసాక పక్కన కొన్ని మాటలు రాసుకున్నాడు. "నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన మహిళకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఒక సురక్షితమైన అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. నీ ప్రేమ నన్ను ఎల్లప్పుడూ నిలబెట్టింది. నీ బిడ్డగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.
అన్నింటికీ ధన్యవాదాలు.నువ్వు చేసిన ప్రతి త్యాగానికి, నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. మహిళలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు" అంటూ పెట్టుకున్నాడు. ఇక కార్ కొన్న విషయం తెలుసుకున్న ఫ్రెండ్స్ అంతా కూడా విషెస్ చెప్పారు. ఆర్జే చైతు, మర్యాద మనీష్, జ్యోస్నా, సోనియా కంగ్రాట్యులేషన్స్ అని మెసేజెస్ పెట్టారు.





.webp)
