Home

»

Tv News

Bigg Boss 10 Telugu 2nd Week Vote: ఓటింగ్‌లో ముఖేష్, రోహిత్ టాప్.. లీస్ట్ లో ఎవరంటే!

Sep 17, 2026 10:54AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం ఓటింగ్ ఆసక్తికరంగా సాగింది. మొదటి వారంలో ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఇద్దరు కంటెస్టెంట్స్ మిడ్ వీక్ లోనే ఎలిమినేట్ కావడంతో అసలైన ఓటింగ్ మారింది. రెండో వారానికి ఏకంగా 11 మంది నామినేషన్స్ లోకి రావడంతో అందరు షాక్ లో ఉన్నారు. షాలినీ పటేల్, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రామ్ ప్రసాద్, ముకేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ లు ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. అమన్, వంశీ, నరేష్ లు సేఫ్ అయ్యారు.

 

ఇక నిన్నటి అన్ఫీషియల్ ఓటింగ్ ప్రకారం..‌ మొదటి వారం వరకు టాప్ లో దూసుకెళ్లిన త్రిగుణ్ ఇప్పుడు వెనకబడ్డాడు. రోప్ టాస్క్, కెప్టెన్సీ టాస్క్ లలో త్రిగుణ్ ఫిజికల్ గా ఆడటం, స్టెరాయిడ్ కండలు అంటూ రోహిత్ పై చేసిన కామెంట్స్ అతడికి మైనస్ అయ్యాయి. దీంతో త్రిగుణ్ ఓటింగ్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం త్రిగుణ్, రోహిత్ మధ్య కేవలం 1 శాతం తేడా మాత్రమే ఉందని, ఎప్పుడైనా లీడ్ మారే అవకాశం ఉందని ఓటింగ్ పోల్స్ రిజల్స్ట్ ని చూస్తే తెలుస్తోంది.

 

ఈసారి ఓటింగ్‌లో దుమ్ము దులిపేసింది మాత్రం సీరియల్ హీరో ముఖేష్ గౌడ, రోహిత్ నాయుడే. ముఖేష్ 12.84 శాతం ఓట్లతో మూడో స్థానంలో సేఫ్ జోన్ లో ఉన్నాడు. రోహిత్ 29.18 శాతం ఓట్లతో రెండో స్థానంలో, త్రిగుణ్ 29.30 శాతం ఓట్లతో మొదటి స్థానంలో పోటాపోటీగా ఉన్నారు. వీరి తర్వాత రామ్ ప్రసాద్ 10.21 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-4 లో వీరంతా సేఫ్ గా ఉన్నట్లే. ఇక డేంజర్ జోన్ విషయానికి వస్తే లీస్ట్ ఓటింగ్‌లో సృష్టి, కృష్ణుడు, సుధీర్, వర్షిణి ఉన్నారు. సృష్టికి 1.90 శాతం, కృష్ణుడు, సుధీర్, వర్షిణిలకు చెరో 1.74 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నట్లు అనధికారిక పోల్స్ చెప్తున్నాయి. హౌస్ లో స్క్రీన్ స్పేస్ లేకపోవడం, టాస్కుల్లో యాక్టివ్ గా లేకపోవడమే కృష్ణుడు వెనుకబడటానికి కారణంగా చెపుతున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉండటంతో వీరిలో ఇద్దరు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని టాక్ నడుస్తోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com