స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -578 లో... భాగ్యం, వల్లి ప్లాన్ లో భాగంగా ప్రేమ, ధీరజ్ లు తిరుపతి పెళ్లి చేయడానికి సిద్ధమవుతారు. నర్మదను మాటలతో మాయ చేసి గుడికి బయలుదేరగా నర్మద వాళ్ల వెనకే ఫాలో అవుతుంది. అటు గుడిలో చింతామణి కూతురితో తిరుపతి నిశ్చితార్థం జరుగుతుండగా తిరుపతి ఉంగరం తొడగకుండా భయంతో దిక్కులు చూస్తూ ఉంటాడు. భద్రవతి, సేనాపతి ఉంగరం తొడుగమని ఒత్తిడి చేస్తుండగానే ధీరజ్, ప్రేమ గుడికి చేరుకుంటారు. ముందుగానే సేనాపతి కారు టైర్ గాలి తీయించిన ధీరజ్.. గుడిలోకి వెళ్లి పాము పాము అని గట్టిగా అరుస్తాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా కంగారుగా పరుగులు పెట్టగా అదే ఛాన్స్ లో తిరుపతిని తీసుకుని బయటకు పరుగెడతాడు ధీరజ్.
భద్రవతి, సేనాపతి వెంబడించినా కారులో గాలి లేకపోవడంతో చేతులెత్తేస్తారు. రేయ్ ధీరజ్ ఎంత దూరం వెళ్తావో చూస్తానంటూ భద్రవతి కోపంతో రగిలిపోతుంది. అటు నుంచి తప్పించుకున్న ధీరజ్, ప్రేమలు తిరుపతి, సుకన్యను మరో గుడికి తీసుకెళ్తారు. అక్కడ హమ్మయ్య బతికిపోయాం అనుకునేలోపే నర్మద రావడంతో మళ్లీ టెన్షన్ మొదలవుతుంది. పులి బోన్ నుంచి తప్పించుకుని సింహం బోన్ లో ఇరుక్కున్నాం అంటుంది సుకన్య. వెంటనే ధీరజ్ పూజారితో మాట్లాడి తిరుపతి, సుకన్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. కంగారులోనే తిరుపతి సుకన్య మెడలో తాళి కట్టేస్తాడు. గుడిలోకి వచ్చిన నర్మద పెళ్లి అయిపోవడం చూసి షాకవుతూ తమాషాగా ఉందా అంటూ నిలదీస్తుంది. పూజారి అరిష్టం అని చెప్పడంతో అయిష్టంగానే కొత్త జంటను ఆశీర్వదిస్తుంది నర్మద.
పెళ్లి తర్వాత నర్మదతో ధీరజ్ ఎమోషనల్ గా మాట్లాడుతాడు. ఆరోజు నాన్న మాట కాదని మీ పెళ్లి చేసినట్లే ఈరోజు అందరిని కాదని వీళ్ల పెళ్లి చేశాను.. కుదురితే గుర్తించు లేదంటే శిక్షించు అంటాడు. తరువాత తిరుపతి, సుకన్యలను తీసుకుని ఇంటికి వస్తారు. వేదవతిని కళ్లు మూయించి బయటకు తీసుకొచ్చిన ధీరజ్ కళ్లు తెరవగానే ఎదురుగా దంపతులుగా ఉన్న తిరుపతి, సుకన్యను చూపిస్తాడు. దీంతో వేదవతి కళ్లు తిరిగి పడిపోతుంది. సృహలోకి వచ్చాక వగలాడి నా తమ్ముడినే వల వేశావా అంటూ సుకన్యపై విరుచుకుపడుతుంది. రామరాజు కూడా దొంగచాటుగా పెళ్లి చేసుకుంటావా అంటూ తిరుపతిని నిలదీస్తాడు. ఇంతలో వల్లి కూడా వచ్చి సుకన్యను కొడుతుంది. అప్పుడే భద్రవతి వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Illu Illalu Pillalu Today Episode, Illu Illalu Pillalu Sept 12 Episode, Tirupati Sukanya marriage, Dheeraj Prema plan, Bhadravathi entry]




.webp)
