TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Podharillu : మాధవకు రెండో పెళ్లి ఫిక్స్.. చక్రిని చూసి రగిలిపోయిన మహా!

Aug 30, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -195 లో....గోపికకి మా చక్రి ఎలా తెలుసని కేశవ అడుగుతుంది. దానికి చక్రి క్యాబ్ ఎక్కిన రోజు.. వాడు పులిహోర కలిపిన తీరు గుర్తుచేసుకుని సిగ్గుపడుతూ నవ్వింది గోపిక. చాలా రోజులు కనిపించలేదు, ఈ ఏరియాకి వచ్చాక మళ్ళీ కనిపించాడని చెప్తుంది. సత్య కూడా వాడు ఒకసారి కన్నాని కాలేజీకి తీసుకొచ్చాడు..అన్నయ్య అని పరిచయం చేశాడని చెప్తుంది. ఇదంతా విన్న కన్నా గాడికి మైండ్ బ్లాక్ అయింది. తను లవ్ చేసిన అమ్మాయి చక్రిని లవ్ చేస్తుందని తెలిసి తిక్కతిక్కగా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క మాధవ పెళ్లి చూపులు జరుగుతుంటాయి. జయంతి పాత్రలో మంజుల పరిటాల వస్తుంది. తను చాలా క్లియర్ గా చెప్పేసింది. నా పేరు జయంతి, BA చదివా, రెండేళ్ల క్రితం పెళ్లైంది. ఇప్పుడు విడిపోయాను. మళ్ళీ పెళ్లి తర్వాత జాబ్ చేస్తా అని చెప్పడంతో మాధవ కూడా తను మేస్త్రీ అని, తమ్ముళ్లతో కలిసే ఉంటానని పెళ్లయ్యాక కూడా అందరం కలిసే ఉంటామని చెప్తాడు. దానికి జయంతి కూడా ఓకే అంటుంది. కానీ సడన్ గా తన మాజీ భర్తను అక్కడికి పిలుస్తుంది. వాడు వచ్చి మాధవతో పొగరుగా, ఈమెను వారం కూడా భరించలేవు.. భరిస్తే లక్ష ఇస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో మాధవ కంగారు పడతాడు.

ఆ తర్వాత కన్నా లవ్ ఫెయిల్ అయి డల్ గా కూర్చుంటే చక్రి మాత్రం గాల్లో తేలినట్టుందే అని పాట పాడుకుంటూ హుషారుగా తిరుగుతుంటాడు. ఇక మహా రూం లోంచి బయటకు రాగానే కావాలనే.. అమ్మాయి నన్ను ప్రేమిస్తుందట.. నా నంబర్ అడిగిందట.. నా మాటలకు ఎవరైనా పడిపోతారని చక్రి గట్టిగా చెప్తుంటాడు. అందంగా ఉంటే అమ్మాయిలు ఇలానే పడిపోతారని ఓవర్ చేస్తాడు. దాంతో మహాకి కోపం వచ్చి తన గదిలోకి  వెళ్ళిపోతుంది. దానికి చక్రి, ఇది పొసెసివ్ నెస్ రా అని కేశవతో అంటాడు.

రాత్రికి పెళ్లిళ్ల బ్రోకర్ ఫోన్ చేసి అమ్మాయి వాళ్లకు నువ్వు నచ్చావు.. రెండు రోజుల్లోనే మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. దాంతో మాధవ షాక్ అవుతాడు. ఇంకా ఇంట్లో వాళ్లకి చెప్పలేదు కదా అని టెన్షన్ పడతాడు. అదే టైమ్ లో చక్రి, ఏంటన్నయ్య రెండు రోజుల్లో అంటున్నావని అడుగుతాడు. మాధవ ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తుండగానే గాయత్రి ఎంట్రీ ఇస్తుంది. కన్నాని చూసి నీ గురించి చెప్పేస్తా అని బెదిరించడంతో.. మహ ఏంటని అడుగతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

[Podarillu Serial Today Episode, Podarillu Telugu Serial, Podarillu 29 August Episode, Madhava Second Marriage, Chakri Maha Love Track, Kanna Love Failure, Star Maa Podarillu Serial Update]

google-ad-img