
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఏ దేవి వరమో నీవు Ye Devi Varamo Neevu. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 68 లో.. రోహిత్ కి అంజలి రాఖీ కట్టినందుకు గాను అతను యాభై రూపాయలు ఇస్తాడు. ఇక ఆ యాభై రూపాయలని చూసుకుంటూ మురిసిపోతుంది అంజలి. మనీష్ ని పిలిచి కార్ లో బయటకు తీసుకెళ్తుంది. యాభై రూపాయలతో షాపింగ్ చేయాలి.. లిస్ట్ రాయాలని అనగానే మనీష్ షాక్ అవుతాడు. అంజలి కావాలని అని అడుగడంతో ఇక తప్పక పెన్ను, పేపర్ తీసుకొస్తాడు మనీష్. అంజలి చెప్తుంటే మనీష్ లిస్ట్ రాస్తాడు. అతను రాస్తూనే ఉంటే అంజలి చెప్తూనే ఉంటుంది దాంతో విసుగుచెందిన మనీష్.. అమ్మా నీ దగ్గరున్న డబ్బులకి ఇవన్నీ రావు అని ఆపేస్తాడు.
ఆ తర్వాత ఒక షాప్ కి వెళ్ళి.. యాభై రూపాయలకి ఏమేమీ వస్తాయో అవి తీసుకుంటుంది. అయితే వాటితో అంజలి బాగా సంతోషంగా ఉంటుంది. నువ్వు జస్ట్ యాభై రూపాయల షాపింగ్ చేసి ఇంత ఆనందపడుతున్నావని మనీష్ అంటాడు. లైఫ్ చాలా చిన్నది .. ఇలాంటి చిన్నచిన్న ఆనందాలు లేకపోతే జీవితమే ఉండదని అంజలి అంటుంది. దాంతో మనీష్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత అంజలి, మనీష్ ఇంటికి వెళ్తారు. అంజలిని గీత పిలుస్తుంది. ఎందుకు నువ్వు మా ఇంటికి వచ్చావు.. మీ అమ్మ నాన్న ల కోసం మా తాత దగ్గరికి ఎందుకు వచ్చావ్.. మా నాన్నకి మీ అమ్మనాన్న తెలుసా? మా అమ్మను పిలిచి అడగాల్సి ఉంటుందని గీత అంటుంది. దాంతో అంజలి టెన్షన్ పడుతుంది. కానీ తడబడకుండా అదంతా తలరాత అని అంజలి చెప్తుంది. ఇక తన అమ్మనాన్నల కోసం అడిగితే హాస్టల్ వార్డెన్ చనిపోయిందని, ఆ తర్వాత తాతగారు చనిపోయారని , అందుకే అమ్మమ్మ దగ్గర ఉన్నానని అంజలి చెప్తూ ఎమోషనల్ అవుతుంది.
ఇక ఏడుస్తూ అంజలి వెళ్ళిపోతుంది. దాంతో గీత ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇక గీత కూతురు భవి హాల్ లో ఉన్న మనీష్ దగ్గరికి వస్తుంది. ఏంటి బావ ఎప్పుడూ పని అంటావ్. కాసేపు బయటకు వెళ్దాం.మ సరదాగా పార్టీ చేసుకుందామని అడుగుతుంది. దాంతో మొన్న జరిగిన ఇంటర్నల్ మార్క్స్ యావరేజ్ గా వచ్చాయని.. ఇప్పుడు మనం ఎందుకు పార్టీ చేసుకోవాలంటూ క్లాస్ పీకుతాడు మనీష్. దాంతో భవి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు హాలిడే అవ్వడంతో వికారాబాద్ వాటర్ ఫాల్స్ కి వెళ్దామని మనీష్ ని భవి అడుగుతుంది. ఆఫీస్ వర్క్ ఉందని మనీష్ అంటాడు. దాంతో గీత దగ్గరకి భవి వచ్చి అడుగుతుంది. మనీష్ ని పిలవమని గీత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




(2).webp)
.webp)
