Ye Devi Varamo Neevu: అంజలికి డాలర్ ఇచ్చిన గీత.. కమల, భవిత ఫైర్!
Nov 29, 2026 10:00AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -128 లో... లక్ష్మీ దేవి దగ్గర పెట్టిన డాలర్ ని ఇవ్వడానికి గీత కళ్ళు మూసుకుని తన కూతుళ్ళని పిలుస్తుంది. ఏం అవసరం ఉందో అని అంజలి వస్తుంది. గీత కళ్ళు తెరిచే సరికి తన ముందు అంజలి ఉంటుంది. అది కమల చూసి "ఏయ్ నువ్వేంటి తల్లీ కూతుళ్లకి మధ్యలో ఉన్నావ్" అని కోప్పడుతుంది.
గీత కళ్ళు తెరిచే సరికి అంజలి ఉంది కాబట్టి ఆచారం ప్రకారం డాలర్ ని అంజలికే ఇవ్వాలని రత్నం అంటుంది. దానికి గీత కూడా సరే అని డాలర్ ని అంజలికి ఇస్తుంది. అంజలి మురిసిపోతూ అది తీసుకుంటుంది కానీ కమల, భవిత కోపంగా చూస్తారు.
అంజలి డాలర్ ని చూస్తూ మురిసిపోతుంటే అప్పుడే మనీష్ వచ్చి నేను ఇచ్చే చైన్ గిఫ్ట్ కూడా తీసుకో అని అంటుంటే ఇప్పుడే వద్దని అంజలి అంటుంది. దీంతో మనీష్ అలుగుతాడు, అంజలి తనకి సర్ది చెప్తుంది.
మరోవైపు కూతురు ప్లేస్ లో ఉండి అది డాలర్ తీసుకోవడం ఏంటని కమలతో భవిత అంటుంది. దాని సంగతి నేను చూసుకుంటానని కమల అంటుంది. ఆ తర్వాత రాకీకి మళ్ళీ ఇల్లు వదిలి పెట్టాలని ఉండదు. దీంతో బ్యాగ్ లో బట్టలు అన్నీ తియ్యబోతుంటే అప్పుడే అంజలి వచ్చి.. ఏంటి ఇంకా వెళ్లలేదు, నువ్వు ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తుంది. దీంతో రాకీ సరే అంటాడు.
మరోవైపు భవిత, మనీష్ పెళ్లి గురించి మాట్లాడాలని శంకర్ అనుకుంటాడు. అందరూ భోజనం చేస్తుంటే పెళ్లి టాపిక్ ని శంకర్ మొదలు పెట్టాలనుకుంటాడు. అప్పుడే రాకీ బ్యాగ్ తో వచ్చేసరికి ఇప్పుడే వెళ్తున్నావా అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. చదువుకోవాలని రాకీ అంటాడు. తన చేతికి ఏదో గాయం చేసుకుని కావాలని అది అందరికీ చూపిస్తూ బై చెప్తాడు కానీ అది ఎవరూ గమనించరు. రాకీ వెళ్తుంటే గీత ఆగమని చెప్తుంది .
తరువాయి భాగంలో డాలర్ చూస్తూ మురిసిపోతూ ఇప్పుడే అమ్మకి నేనే కూతురు అని చెప్పాలనుకుంటుంది. మరోవైపు గీత దగ్గరికి భవిత వచ్చి ఆ అంజలి బావని బుట్టలో వేసుకుందని చెప్తుంది . అంజలి వచ్చి "అమ్మగారు మీకో విషయం చెప్పాలి" అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



