.webp)
స్టార్ మా లో టాప్ కామెడీ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ వారం ఆల్ ఇండియా టూర్ కాన్సెప్ట్ తో రాబోతోంది. తాజాగా విడుదలైన ప్రోమో ఫుల్ నవ్వులు పూయిస్తోంది. ప్రోమో మొదట్లో "టికెట్ ఇవ్వు" అని సౌమ్యని ప్రదీప్ అడుగగా.. ఆడవాళ్లందరికీ ఫ్రీ అన్నారని సౌమ్య అంటుంది. దీనికి ప్రదీప్.. వదిలితే మీ ఆడవాళ్లు అంతరిక్షంలో కూడా ఆధార్ కార్డు చూపించి వెళ్తారనగానే అందరూ నవ్వుల్లో మునిగిపోతారు. హే జతీన్ ఏంటి మురిసిపోతున్నావని ప్రదీప్ అనగానే ఫస్ట్ మురిసిపోతాడు అంటూ గ్యాప్ ఇవ్వగానే మరోసారి అందరు నవ్వుతారు.
ఆ తర్వాత అందరు బస్సులో ప్రయాణిస్తుండగా కామాక్షి, భాస్కర్ల బస్సును ఆపుతుంది. అప్పుడే.. ఓ రెండు ప్రేమ మేఘాల సాంగ్ వస్తుంది. మీరు కాశ్మీర్ లో పుట్టారా? అని ప్రదీప్ అనగానే లేదు.. ఎందుకు అని కామాక్షి అడుగుతుంది. కాశ్మీర్ ఆపిల్ లా ఉన్నారని ప్రదీప్ అనగానేమీరు మైసూర్ లో పుట్టారా? మైసూర్ మహారాజులా అనిపిస్తున్నారని కామాక్షి కౌంటర్ వేయడంతో అందరూ నవ్వుతారు. ఇవన్నీ ఎందుకండి, ఇప్పుడు ప్యాసింజర్లం ఫ్యామిలీలా కలిసి పోవాలని ఆది అంటాడు. సరే అన్నయ్యా అని కామాక్షి అనగానే ఆదికి పంచ్ పడుతుంది.
ఆ తర్వాత గోవా ట్రిప్ లో భాస్కర్ పక్కన ఇద్దరు అమ్మాయిలు ఉండగా.. పాపలు ఇద్దరూ యానిమల్ లవర్స్ అనుకుంటా అని ఆది అనగానే నీకెలా తెలుసని భాస్కర్ అడుగుతాడు. నీ పక్కన ఉన్నారు కదా అని ఆది అనగానే మరోసారి నవ్వులే నవ్వులు. జీవన్ అన్న స్టెప్స్ కావాలనగానే తన పక్కన ఇద్దరు అమ్మాయిలు చేరి 'జల జల జలపాతం' అంటూ డాన్స్ చేస్తారు. ఆ తర్వాత పంజాబ్ ఇంకా ఇతర రాష్ట్రాల టూర్లతో అందరిని నవ్విస్తారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




(11).webp)

