Home

»

Tv News

కంటెస్టెంట్ కి దిష్టి తీసి ఆనందాన్ని షేర్ చేసుకున్న కృష్ణ మాష్టర్...

Sep 22, 2026 10:02AM

ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట దిష్టి, సెట్ లో ఉన్న వాళ్ళ దిష్టి, మా కొరియోగ్రాఫర్ ల ద్రుష్టి ఊసేయమ్మా మూడు సార్లు  అంటూ ఫైనల్ కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వెళ్లిన కృష్ణ మాష్టర్ దిష్టి తీసి మరీ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఐతే దీనికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటో చూద్దాం.

గౌతమ్ అనే కంటెస్టెంట్ వచ్చి డాన్స్ చేసేసరికి జిత్తు మాష్టర్ అసలు బజర్  ప్రెస్ చేయకుండా డైరెక్ట్ గా స్టేజి మీద కంటెస్టెంట్ దగ్గరకు వెళ్లి మెడలో కర్చీఫ్ వేసేసి ఈ కంటెస్టెంట్ నాకే అనేశాడు. దాంతో కృష్ణ మాష్టర్, యష్ మాష్టర్ అంతా కూడా ఒక ప్రాసెస్ ఉంది కదా అది కరెక్ట్ కాదు అని చెప్పారు. "కర్చీఫ్ వేసేలా ఉంటే అందరం కర్చీఫ్ లు వేసేవాళ్ళం కదా.. ఒక షో చేస్తున్నాం, ఒక రూల్ ఉంది, కనీసం బజర్ కూడా నొక్కకుండా ఎలా  " అన్నారు యష్ మాష్టర్. "అది మీ తప్పు కదా...నేను బజర్ నొక్కడం మర్చిపోయాను.  " అన్నాడు జిత్తు మాష్టర్. "కర్చీఫ్ వేస్తున్నారంటే పెర్ఫార్మెన్స్ నచ్చి కర్చీఫ్ వేస్తున్నారేమో అనుకున్నా. ఇది చాలా దూరం వెళ్తోంది.

రూల్స్ ఫాలో చేయండి. అందరం రూల్స్ ఫాలో అవుతున్నప్పుడు మీరొక్కరే ఒక రూట్ లో వెళ్ళాలి అంటే అది యాక్సెప్టబుల్ కాదు " అన్నారు కృష్ణ మాష్టర్. ఐతే జానీ  మాష్టర్ తెలివిగా ఏ కొరియోగ్రాఫర్ కావాలో ఎంచుకో అంటూ కంటెస్టెంట్ గౌతమ్ కి చెప్పాడు. అతను కూడా జిత్తు మాష్టర్ ని కావాలన్నాడు . వెంటనే కృష్ణ మాష్టర్ లేచి "నాకు ఇది అన్  ఫెయిర్ అనిపిస్తోంది. రూల్స్ పాటించిన కూడా మాకు కంటెస్టెంట్స్ ని ఇవ్వరా. ఫైనల్ కంటెస్టెంట్ ఎవరైనా సరే నేను వాళ్ళతోనే కప్పు కొడతా అంటూ కృష్ణ మాష్టర్ శపధం చేసాడు. అలా ఫైనల్ గా వచ్చిన కంటెస్టెంట్ అనుష్క రాథోడ్ ని కృష్ణ మాష్టర్ సొంతం చేసుకున్నాడు.

 

 

 

[Dhee 21 Double Impact, Dhee 21, Krishna Master, Jithu Master, Yash Master, Jani Master, Gautham, Anushka Rathod, Dhee 21 Contestants, Dhee 21 Choreographers]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com