Home

»

Tv News

ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ.. చెఫ్ మంత్రలో ఫుల్ ఫన్!

Sep 17, 2026 9:36AM

ఆహా (aha) ఓటీటీ వేదికగా ప్రసారమయ్యే ప్రముఖ కుకింగ్ అండ్ కామెడీ షో  చెఫ్ మంత్ర  సీజన్ 6 (Chef Mantra Project-K S6) ఎపిసోడ్ ప్రోమో చాలా ఆసక్తికరంగా విడుదలైంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి, సక్సెస్ ఫుల్ యాంకర్ సుమ వ్యవహరించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో ఇమ్మాన్యుయల్, అంబటి అర్జున్, రీతూ చౌదరి, సుప్రీత, సోనియా-సిద్ధు జంట, విష్ణుప్రియ, అమర్‌దీప్, యాదమ్మరాజు , కావ్య శ్రీ వంటి ప్రముఖులు కూడా వచ్చారు. వీరు కాకుండా ఒక ప్రత్యేకమైన అమ్మ, కొడుకు జోడీ కూడా ఈ వంటల పోటీలో భాగస్వామ్యమయ్యారు.

ఇక ఈ ఎపిసోడ్ కు ప్రధాన ఆకర్షణగా ప్రముఖ నటుడు 'పుష్ప' సినిమా ఫేమస్ 'ఫహాద్ ఫాజిల్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఆయనతో పాటు ఒక చిన్నపాప, ఇంకా డైరెక్టర్ ఒకరు వచ్చారు. ఇక షోలో యాదమ్మ రాజు వేసిన పంచ్ లు ఫుల్ వర్కవుట్ అయ్యాయి. ఇక చెఫ్ మంత్రలో భాగంగా.. జాంగ్రీ చేయమంటుంది నందిని రెడ్డి.. జాంగ్రీలు స్పైసీగా ఉండాలా మేడమ్ అని సోనియా అంటుంది. దాంతో నందిని రెడ్డి సరదాగా గన్ తీసుకొని వచ్చి హడావుడి చేయడం అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈ సరదా సన్నివేశాలు ఎపిసోడ్‌పై అంచనాలను మరింత పెంచేశాయి.

సెలబ్రిటీలంతా కలిసి వంటలు చేస్తూనే ఒకరిపై ఒకరు వేసుకున్న కౌంటర్లు, సరదా సరదాగా బాగున్నాయి. వంటకాల తయారీలో వారు పడిన పాట్లు, చేసిన అల్లరి ప్రేక్షకులకు నాన్‌స్టాప్ వినోదాన్ని అందిస్తుంది. మొత్తానికి వినోదం, వంటలు మరియు సెలబ్రిటీల సందడితో నిండిన ఈ 'చెఫ్ మంత్ర' ప్రోమో అదిరింది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com