Home

»

Tv News

డెమోన్ పవన్ రీతూ బంగారం..రియల్ లైఫ్ లో కూడా ఇలానే ఉండాలి...దీవించిన శ్రీముఖి

Aug 26, 2026 5:37PM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం న్యూ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఇందులో కుకు విత్ జాతిరత్నాలు వెర్సెస్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోస్ కి సంబంధించిన వాళ్లంతా వచ్చారు. సుహాసిని, డెమోన్ పవన్, నిఖిల్ విజయేంద్ర సింహ, బాలు, అర్జున్ కళ్యాణ్, కావ్య, ప్రియాంక జైన్ ఇలా అందరూ వచ్చారు. ఇక నిఖిల్ స్టేజి మీదకు రాగానే "ఆదివారం పరైవారం అంటే ఏంటీ షో " అంటూ ఏమీ తెలీనట్టు అడిగాడు. వెంటనే రీతూ వచ్చి "పరైవారం కాదురా పరివారం" అని కరెక్ట్ చేసింది. "ఎంత కుకు విత్ జాతిరత్నాలు  షో చేసినంత మాత్రాన మొఖం చూపించుకోలేకపోతున్నావా " అంటూ మూతికి మాస్క్ వేసుకొచ్చిన రాకింగ్ రాకేష్ మీద శ్రీముఖి కౌంటర్ వేసింది.

"ఈయన చేసిన వంటలకు బయట ముఖం చూపిస్తుంటే కొడుతున్నారు అందుకే " అంటూ హరి కూడా కామెంట్ చేసాడు. ఇక డెమోన్ పవన్, రీతూ వైపు వచ్చిన శ్రీముఖి చాలా ప్రేమగా ఆప్యాయంగా "ఇద్దరూ బాగున్నారా బంగారం " అని అడిగింది. వెంటనే రీతూ "మా బంగారం చూసావా " అంది. "ఆ వీడియో సాంగ్ లో ఉన్నట్టు రియల్ లైఫ్ లో కూడా అతి త్వరలో జరగాలని మీ ఇద్దరినీ దీవిస్తూ" అంటూ విశే చెప్పింది. తర్వాత పవన్, రీతూ కలిసి  బంగారం సాంగ్ కి డాన్స్ చేశారు. అందానికి ఎంటర్టైన్మెంట్  కావ్య, స్టైల్ కి ఎంటర్టైన్మెంట్ ప్రియాంక జైన్, హాట్ నెస్ ని ఎంటర్టైన్మెంట్ అర్జున్ కళ్యాణ్  అని చెప్తూ  లవ్ కి ఎంటర్టైన్మెంట్ బాలు అంటూ తెగ సిగ్గుపడిపోయింది శ్రీముఖి.

" పరివారానికి పోటీగా ఏదో టీమ్ వచ్చింది వాళ్లకు ఏమన్నా చెప్తావా అనేసరికి వాళ్ళు సంవత్సరానికి ఒక మూడు నెలలు వస్తున్నారు. మేము సంవత్సరం మొత్తం వస్తున్నాం అన్నాడు బాలు.. ఇంతలో హరి  "ఆయన కూడా కుకు విత్ జాతిరత్నాలు  సీజన్ 1 లో చేసాడు " అన్నాడు. "అవును ఫస్ట్ వీక్ లో  ఎవరు చేయించారనుకున్నావ్ బాలును నేనే " అని సీక్రెట్ ని రివీల్ చేసేసింది శ్రీముఖి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com