Home

»

Tv News

అనిల్ రావిపూడి అన్నయ్యలా నిలిచిన వేళ.. చందు పాటకు ఫిదా అయిన అల్లరి నరేష్

Aug 26, 2026 5:40PM

సరిగమప నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో గెస్ట్ గా అల్లరి నరేష్ ఎంట్రీ ఇచ్చారు. ఒక మెల్  కంటెస్టెంట్ వచ్చి "వయ్యారి బ్లాకు బెర్రీ ఫోనులే" అనే సాంగ్ పాడాడు. అతని వాయిస్ కి అల్లరి నరేష్ ఫిదా ఇపోయారు. "వింటున్నంత సేపు అచ్చం కైలాష్ ఖేర్ గారు పాడినట్టే ఉంది " అంటూ కితాబిచ్చారు. ఇక అతని పేరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్
చందు ఆన్ వోకల్స్ తో కనిపించాడు.

హోస్ట్ సుధీర్ అతని గురించి చెప్పాడు. "అతను షాపింగ్ మాల్ లో పార్కింగ్  టికెట్స్ తీసుకునే దగ్గర పని చేస్తూ ఉంటాడు. సింగింగ్ అనేది కొంతమందికి ప్యాషన్ అవ్వొచ్చు కొంతమందికి గోల్ అవ్వొచ్చు. ఇలాంటి వాళ్లకు లైఫ్ అన్నమాట " అని చెప్పాడు. తర్వాత అనంత శ్రీరామ్ మాట్లాడారు. "షాపింగ్ మాల్ లో మౌనంగా ఉన్న నీ గొంతు సినిమా హల్ లో మారుమోగే రోజు చాలా దగ్గరలో ఉంది అని అనుకుంటున్నా "అన్నారు. "వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కూడా పని ఆపేస్తే ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది. ఈరోజు ఒక్కడే వచ్చి ఇక్కడ పాడుతున్నాడు  " అని మళ్ళీ చెప్పాడు సుధీర్.

ఈ షోకి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ వాళ్ళను వెంటబెట్టుకుని వచ్చి వాళ్ళు సెలెక్ట్ ఫామిలీ మెంబర్స్ తో సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఈ కంటెస్టెంట్ కి మాత్రం అలా ఉపాధి పోతుంది కాబట్టి ఫామిలీ నుంచి ఎవరూ రాలేదు అన్న సెన్స్ లో సుధీర్ చెప్పుకొచ్చాడు. వెంటనే అనిల్ రావిపూడి మానవతా దృక్పధంతో రియాక్ట్ అయ్యారు. "హే నీకు అన్నయ్య ఉన్నాడు అనిల్ రావిపూడి .. వస్తున్నాడు " అంటూ వెళ్లి ఆ సింగర్ ని హగ్ చేసుకుని బెస్ట్ విషెస్ చెప్పారు. "కళ అనేదాన్ని ఎవ్వడూ ఆపలేడు. అది ఎన్ని ఆటంకాలు ఉన్నా అలా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది" అంటూ అతన్ని మోటివేట్ చేశారు.  అనిల్ రావిపూడి చేసిన పనికి నెటిజన్స్ ఫిదా ఇపోయారు. అనిల్ అన్న మీరు సూపర్ అంటుంటే చందు చాలా బాగా పాడుతున్నావ్ మంచి వాయిస్ సూపర్ అంటూ కామెంట్స్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com