Home

»

Tv News

రష్మీ తాగే బ్రాండ్ ఏంటో చెప్పేసిన చంటి... ఎం ఖర్మ రా బాబు... ప్రసాద్ భార్యగా నటించాల్సి వచ్చింది

Aug 26, 2026 5:22PM

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇందులో ఒక్కో స్కిట్ ఒక్కో రేంజ్ లో పేలబోతున్నాయన్న విషయం తెలుస్తోంది. ముందుగా చలాకి చంటి చేతిలో మందు బోటిల్ తీసుకుని వచ్చేసాడు. ప్రేమ్ నగర్ లో అక్కినేని నాగేశ్వరావులా చేతిలో బోటిల్ పెట్టుకుని వెనక ప్లే అవుతున్న "ఎవరి కోసం " అనే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇంతలో అందంగా లక్ష్మీ దేవిలా ముస్తాబై వచ్చిన హోస్ట్ రష్మీ "చంటి తాగితే బాధలు పోతాయా " అంటూ చాలా అమాయకంగా అడిగింది.

వెంటనే చంటి "నువ్వు అడుగుతున్నావా... ఎంత తాగితే బాధలు పోతాయో నీకు తెలీదా... ఎలా తాగితే బాధలు పోతాయో నీకు తెలీదా ...నువ్వేం తాగుతావో నాకు తెలీదా " అంటూ కౌంటర్లు మీద కౌంటర్లు వేసాడు. ఆ మాటకు మూతి తిప్పుకుంది రష్మీ. ఇంతలో కిర్రాక్ సీత బిందె పట్టుకుని వచ్చింది. "సీతా నేనంటే ప్రేమ అన్నావ్. నేనంటే ఇష్క్ అన్నావ్. మా నాన్నకు ఒంట్లో బాలేదన్నావ్. మా అమ్మకు కాన్సర్ అన్నావ్. నా దగ్గర డబ్బులు దొబ్బేసావ్. ఇప్పుడేమో నేనెవరన్నావ్ ... జెన్ జీ" అంటూ ముఖం చిట్లించాడు.

వెంటనే సీత " ఆరోజు పార్క్ లో ఒంటరిగా వదిలేసి వెళ్ళింది నువ్వు కాదూ. ఈ కన్నీటికి కారణం నువ్వు కాదూ " అంది ఏడుస్తూ. " నోర్ముయ్ ... ఆరోజు నీ చేయి పట్టుకుంటే అబ్బా అదే టచ్ అన్నది నువ్వు కాదా " అంటూ సీత మీద ఫైర్ అయ్యాడు చంటి.  తర్వాత శ్రీ సత్య - పంచ్ ప్రసాద్ , రోహిణి స్కిట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది.  "సత్య నువ్వు ఖర్మను నమ్ముతావా " అన్నాడు ప్రసాద్. "నిజానికి ఇది వరకు నమ్మేదాన్ని కాదు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీ భార్యగా చేయాలన్నారు చూడండి ఎం ఖర్మ రా బాబు అనుకున్న తర్వాత నమ్మాల్సి వచ్చింది " అని చెప్పింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com