Home

»

Tv News

Bigboss 10 contestants : బిగ్ బాస్ సీజన్ 10 లో ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ గా దేబ్జానీ మోదక్..

Sep 7, 2026 10:50AM

బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు దశావతారం హౌస్ లోకి ఫస్ట్ సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఫేమ్ దేబ్జానీ మోదక్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. గ్రాండ్ లాంఛ్ రోజున హోస్ట్ నాగార్జున ఫస్ట్ కంటెస్టెంట్ గా ఆమె పేరు అనౌన్స్ చేయగానే స్టేజ్ మొత్తం సందడిగా మారింది. బెంగాలీ బ్యూటీ అయిన దేబ్జానీ స్టార్ మా సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఫస్ట్ కంటెస్టెంట్ గా పిలవడం వల్ల ఆమెకు మొదటి నుండే ఎక్స్ట్రా హైలైట్, స్క్రీన్ టైం దక్కింది.

దేబ్జానీ మోదక్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆమె మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సీరియల్స్ లోకి వచ్చింది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో ఆమె పాజిటివ్, ఎమోషనల్ రోల్ తో ఇంటింటికి చేరింది. సీరియల్ లో చీరకట్టులో కనిపించే దేబ్జానీ, బయట మాత్రం ఫుల్ గ్లామరస్ గా, బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగు, బెంగాలీ రెండు ఇండస్ట్రీలలోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది.బిగ్ బాస్ హౌస్ లో దేబ్జానీ గేమ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఫస్ట్ కంటెస్టెంట్ గా వెళ్లడం వల్ల హౌస్ లో అందరికంటే ముందు సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. గత సీజన్లలో సీరియల్ హీరోయిన్లు ప్రియాంక, అరియానా లాంటి వాళ్ళు టాప్ 5 వరకు వెళ్లారు. దేబ్జానీ కూడా తన బెంగాలీ యాస తెలుగు, ఎమోషనల్ గేమ్, ఫ్రెండ్షిప్ బాండ్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటే ఫైనల్ రేస్ లో ఉంటుంది. అయితే గ్లామర్ పరంగా బయట ట్రోల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

మొత్తానికి దశావతారం థీమ్ లో దేబ్జానీ మోదక్ ఏ అవతారం ఎత్తుతుందో చూడాలి. సీరియల్ లో కనిపించిన అమాయకపు అమ్మాయి అవతారమా, లేక సోషల్ మీడియాలో కనిపించే బోల్డ్ అవతారమా అనేది హౌస్ లో తేలుతుంది. ఫస్ట్ కంటెస్టెంట్ గా ఆమెకు వచ్చిన ఈ బంపర్ ఛాన్స్ ని టైటిల్ వరకు తీసుకెళ్తుందా లేదా ఫస్ట్ వీక్ లోనే ఆటో ఎక్కుతుందా అనేది వేచి చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com