
బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు గ్రాంఢ్ గా మొదలైంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. హౌస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా దేబ్జానీ వచ్చింది. సెకండ్, థర్డ్, ఫోర్త్ కంటెస్టెంట్లుగా వరుసగా ఎంట్రీలు జరిగాయి. సెకండ్ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్ అలియాస్ ఆదిత్ అరుణ్ వచ్చాడు. ఇటీవలే పేరు మార్చుకున్న త్రిగుణ్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలో సెకండ్ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష సీజన్ 2 నుంచి ఫస్ట్ కామనర్ గా ఝాన్సీ టికెట్ కొట్టి హౌస్ లోకి వెళ్లింది. నాలుగో కంటెస్టెంట్ గా డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా పర్సనాలిటీ సుధీర్ రెడ్డి హౌస్ లోకి అడుగుపెట్టాడు. తన AV లో అనుష్క శెట్టి తన బిగ్గెస్ట్ క్రష్ అని చెప్పి నవ్వులు పూయించాడు.
హౌస్ లోకి వెళ్లిన ఈ నలుగురికి నాగార్జున వెంటనే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నలుగురిలో ఇద్దరికి మాత్రమే తలరాతలు మార్చే 'మ్యాజిక్ కీ'లు దక్కుతాయని చెప్పి లవ్ ట్రయాంగిల్ అనే టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో ఎమోషన్స్, లవ్ యాంగిల్, గేమ్ ప్లాన్ అన్నీ కలిపి టెస్ట్ చేశారు. చివరకు ఈ టాస్క్ లో కామనర్ ఝాన్సీ, హీరో త్రిగుణ్ మ్యాజిక్ కీలు సొంతం చేసుకుని రెండు స్పెషల్ పవర్స్ దక్కించుకున్నారు. ఫస్ట్ రోజే పవర్స్ రావడంతో వారిద్దరూ హౌస్ లో పవర్ ఫుల్ పొజిషన్ లోకి వెళ్లిపోయారు. సుధీర్ రెడ్డి ఈ రేస్ లో ఓడిపోయాడు.
5వ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష దాటొచ్చిన అమన్ మసూద్ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎంపికై హౌస్ లోకి వచ్చాడు. అతనికి నాగార్జున మెడలో గోల్డ్ మెడల్ వేసి సత్కరించి.. ఒక రెడ్ డాట్ ఇచ్చి సీక్రెట్ టాస్క్ అప్పగించారు. అగ్నిపరీక్షలో మీరు నా ఒక అవతారం మాత్రమే చూశారని.. హౌస్ లో రచ్చరచ్చ చేస్తానంటూ అమన్ ఫుల్ ఎనర్జీతో, రచ్చ స్టైల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ రెడ్ డాట్ సీక్రెట్ టాస్క్ ఏంటి.. అది హౌస్ మేట్స్ ని ఎలా ఇబ్బంది పెడుతుందనేది ఇప్పుడు బిగ్ సస్పెన్స్ గా మారింది.
ఈ ఎపిసోడ్ మధ్యలో సర్దార్-2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తీ, విలన్ ఎస్.జె సూర్య వచ్చి నాగార్జునతో కలిసి సందడి చేశారు. సినిమా ట్రైలర్ ప్లే చేసి జోకులు వేస్తూ నవ్వించారు. మొత్తానికి ఫస్ట్ అయిదు మంది ఎంట్రీతోనే దశావతారం సీజన్ లో 10 పవర్స్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. మరి ఈ మ్యాజిక్ కీలు, రెడ్ డాట్ టాస్క్ హౌస్ లో ఎలాంటి చిచ్చు పెడతాయో చూడాలి.




.webp)

