.webp)
జీ సరిగమప షో గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. మంచి మంచి పాటలతో సింగర్స్ జడ్జెస్ ని అలరించారు. ఇందులో యూఎస్ నుంచి సంహిత్, బెంగళూరు నుంచి కీర్తి చంద్రు, నుజత్ సమ్రీన్ , గాజరంపల్లి నుంచి అశ్విని రాథోడ్, వైజాగ్ నుంచి దైవిక వచ్చారు. ఇందులో దైవిక్ ఐతే సుధీర్ ని ఒక రేంజ్ లో ఆదుకున్నాడు. జూనియర్ సుధీర్ లా కావాలనుకుంటున్నట్టు చెప్పాడు. దైవిక్ రావడంతోనే "నా జన్మ ధన్యమైందన్నా , నేను నీకు పెద్ద ఫ్యాన్ ని , జై సుధీర్ అన్నా " అంటూ నినాదాలు చేసాడు. అన్నా "నాకు అసలు పేర్లు వడ్డీ పేర్లు తెలీవు నన్ను జూనియర్ సుధీర్ అని పిలిస్తే చాలు .. నీకో గిఫ్ట్ అన్నా సుధీర్ కోటి రాసాను. " అని ఒక బుక్ ని ఇచ్చాడు.
ఇక ఇమ్మానుయేల్ ఐతే "సుధీర్ కోఠిలో బట్టలేసుకుని వచ్చాడు" అంటూ పరువు తీసేసాడు. "ఐనా నేనంటే అంత పిచ్చి ఏంట్రా నీకు " అన్నాడు సుధీర్. "ఎవరికైనా బ్లడ్ టెస్ట్ చేస్తే ఏ గ్రూపో, బి గ్రూపో వస్తుందన్న నాకు నీ గ్రూపే సుధీర్ గ్రూప్ అని వస్తుందన్న " అన్నాడు. "మీది ఏ ఊరు " అన్నాడు. "నాది ప్రోపర్ వైజాగ్ అన్నా మొన్నే విజయవాడ షిఫ్ట్ అయ్యాను " అన్నాడు. "ఎందుకు షిఫ్ట్ అయ్యావు " అన్నాడు. "నువ్వు పుట్టినూరు విజయవాడ కదా అన్నా " అన్నాడు దైవిక్. "మరి నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నానుగా మరి " అని అనేసరికి "దేవుడిని చూడాలనుకోవడం తప్పు కాదన్నా దేవుడితో కలిసి ఉండాలనుకోవడం చాలా తప్పు " అన్నాడు. "నేను ఇక్కడ వాళ్ళను పరిచయం చేస్తాను, మెంటార్స్, జడ్జెస్" అని సుధీర్ చెప్పేసరికి "అన్నా నువ్వుండగా వాళ్ళెవరూ కనపడరన్నా " అన్నాడు. "సుధీర్ అన్న ఫ్యాన్ ఐతే షో లు చూసావా " అన్నాడు ఇమ్మానుయేల్. "అన్న హీరో కదా షోలో కాదు థియేటర్ లో చూడాలి" అన్నాడు. " అన్న చేసిన ఏదన్నా సినిమా థియేటర్ లో చూసావా " అన్నాడు ఇమ్ము. "అన్న స్టార్ హీరో అయ్యాక చూద్దామని ఆగాను అన్న" అన్నాడు. "అంటే ఇంకెప్పుడు చూడవు ..నిజంగా అన్న ఫ్యాన్ ఐతే సుధీర్ నడిచినట్టు నడువు" అన్నాడు. అలాగే నడిచి కళ్ళజోడు పెట్టి అంత సుధీర్ లానే చేసాడు దైవిక్. తర్వాత ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు పాడిన "జాబిల్లి కోసం " సాంగ్ పడేసరికి ఎస్పీ శైలజ ఫిదా ఇపోయారు.






