Home

»

Tv News

3 బిహెచ్ కె ఫ్లాట్ రాసిచ్చేయ్.. హరికి దీపికా ఫన్నీ డిమాండ్... లాఫింగ్ బుద్దా గిఫ్ట్

Aug 25, 2026 2:44PM

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఏదన్న కోరికలు కోరుకుని ఒక స్టిక్ ని విరగ్గొట్టాలి అని శ్రీముఖి చెప్పింది. అలా కొంతమంది వాళ్ళ కోరికలు కోరుకున్నారు ఐతే జెన్యూన్ కోరికలు కానీ వాటికి అసలు స్టిక్ విరగలేదు. ఇక ఇందులో దీపికా వచ్చి తన కోరిక కోరుకుంది. "ఆయన రైటర్ గా చాలా డైలాగ్స్ రాశారు. అలాగే ఆయనకు నా తలరాతను మార్చి రాసే అవకాశం ఇచ్చాను. రీసెంట్ గా 3 బిహెచ్ కె కొన్నాడు. ఇన్ని డైలాగ్స్ రాస్తున్నావ్ కదా ఆ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కూడా నాకు రాసిచ్చేయ్ " అంది.

ఇక శ్రీముఖి, రోహిణి ఐతే "కొనక కొనక హరి ఒక ఇల్లు కొంటే వెళ్లి తినేసి వచ్చాము. ఇంటీరియర్ చేయించడానికి డబ్బులు లేక అదే ఆపాడు. " అన్నారు. " నా బేబీ నేను ఇలాగే ఉండాలి." అన్నాడు. బేబీ నువ్వు నేను కలిపి ఈ స్టిక్ ని విరగ్గొడదాం అన్నారు కానీ ఇద్దరూ కలిసి విరగ్గొట్టలేకపోయారు. శ్రీముఖి ఐతే ఒక ఇంటి  వాడితో పాటు బైక్ నుంచి కార్ వరకు అప్ గ్రేడ్ ఐనందుకు ఈ చిన్న గిఫ్ట్ అంటూ ఒక చిన్న కార్ బొమ్మను హరికి ఇచ్చింది. "నువ్వు ఒక హీరోయిన్ గా ఈ టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చావు. ఇప్పుడు ఒక కమెడియన్ గా పడిపోయావు. అలాగే రీసెంట్ గా నీ లైఫ్ లోకి ఒక కమెడియన్ కూడా వచ్చాడు. " అంది . "ఇక నా లైఫ్ లో అన్నీ నవ్వులే " అంది దీపికా. "ఇదిగో అందుకే ఈ లాఫింగ్ బుద్దా" అంటూ ఆ బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com