Home

»

Tv News

Brahmamudi : ఐశ్వర్య సంచలన ఛాలెంజ్.. నందుకు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్షన్!

Aug 26, 2026 9:30AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  బ్రహ్మముడి Brahmamudi . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ 1120 లో.. ఐశ్వర్య పట్టుదల మనిషి, మొండిది, ఖచ్చితంగా డిగ్రీ పాస్ అవుతుందని రాజుతో ఇందు అంటుంది. అంటే కావాలనే రెచ్చగొట్టావా అని రాజు అడిగితే, అవును అప్పుడైనా దారిలోకి వస్తుందని చేశానని, పాసైతే కంపెనీ కూడా పెట్టిస్తానని ఇందు అంటుంది. ఇటు ఐశ్వర్య ఫ్రెండ్ కి ఫోన్ చేసి అన్ని సబ్జెక్టులు క్లియర్ చేయాలని హెల్ప్ అడుగుతుంది. దానికి ఆ ఫ్రెండ్ ఒక్క సబ్జెక్టే కష్టం, అన్ని చేస్తావా తాగున్నావా అని, డబ్బులు పెట్టుకోమని అంటాడు. నేను కష్టపడి చదువుతానని చెప్పి ఐశ్వర్య ఫోన్ పెట్టేస్తుంది. ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఐశ్వర్య దగ్గరకు లక్కీ వచ్చి నేను హెల్ప్ చేస్తానంటాడు. నువ్వేం చదివావ్ రా అంటే ఆరు పాస్ అంటాడు. నేను డిగ్రీ అంటే, నేను పాస్ అయ్యా నువ్వు ఫెయిల్ అయ్యావ్ కదా అని కౌంటర్ వేసి పెగ్గు ఇస్తాడు. దాంతో ఐశ్వర్య ఫుల్లుగా తాగేసి రెచ్చిపోతుంది. ఇందు సంగతి చెప్తానని లేవబోతే లక్కీ నన్నే ఇందు అనుకో అంటాడు. తాగిన మత్తులో ఐశ్వర్య లక్కీని ఇందు అనుకొని పిచ్చ కొట్టుడు కొడుతుంది.. నేను పాస్ కాలేననుకుంటున్నావా అంటూ ఫైర్ అవుతుంది. దెబ్బలు తట్టుకోలేక అనవసరంగా కమిట్ అయ్యానని లక్కీ పారిపోతాడు.

 

పొద్దున్నే ఇంటికి కొరియర్ వస్తే అపర్ణ తీసుకుంటుంది, అది నందు SI ట్రైనింగ్ కి సెలెక్ట్ అయిన లెటర్.. దాంతో ఇందు, రాజు, అపర్ణ అందరు సంబరపడిపోయి లడ్డూలు పంచుతారు. ఏంటి స్వీట్లు అని శేషు, భ్రమరం అడిగితే నందు సెలెక్షన్ విషయం రాజు చెప్తాడు. శేషు తప్పు చేసినోళ్ల బెండు తీస్తుందా అనగానే భ్రమరానికి పొలమారుతుంది. రాజు ఇంకా అన్యాయం చేసినోళ్ల బెండు కూడా తీస్తుందని అనగానే భయంతో వణికిపోతుంది, స్వాతి నీళ్లు ఇచ్చి కూల్ చేస్తుంది.

 

అపర్ణ మా నందు చిన్నప్పటి నుంచి కలలు కన్నది.. కష్టపడి చదివింది, పార్టీలు పబ్బులు తిరిగే రేఖ పెంపకంలో పెరిగిన ఐశ్వర్య అనుకున్నారా అంటుంది. దానికి ఐశ్వర్య నా మ్యాటర్ ఎందుకని అంటుంది. ఐశ్వర్య కూడా పాస్ అవుతుందని ఇందు సపోర్ట్ చేస్తుంది. శేషు, రాజు మాత్రం మాటలు తప్ప చేతలు లేవు.. పాస్ కాలేవు ఇందుకి బానిస అవుతావని సెటైర్లు వేస్తారు. దాంతో ఐశ్వర్య మీ అందరికి పాస్ అయి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. నందు ఈరోజు సాయంత్రమే వరంగల్ ట్రైనింగ్ కి వెళ్లాలని చెప్తే ఇందు బాధపడుతుంది, కానీ రేఖ మాత్రం వీళ్ల సంతోషాన్ని ఎలా పాడు చేయాలా అని లోపల ప్లాన్ వేసుకుంటుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com