Chinni Chinni Aasa: నాగార్జున చేతుల మీదుగా 'చిన్ని చిన్ని ఆశ' ప్రోమో రిలీజ్!
Nov 29, 2026 2:16PM

స్టార్ మా టీవీలోకి మరో కొత్త సీరియల్ రాబోతోంది. ఆ సీరియల్ పేరే 'చిన్ని చిన్ని ఆశ' (Chinni Chinni Aasa). ఈ సీరియల్ ప్రోమోను బిగ్ బాస్ హోస్ట్, కింగ్ నాగార్జున చేతుల మీదుగా నవంబర్ 28న రిలీజ్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ సీజన్-10 చివరి దశలో ఉండగా నాగార్జున చేత ఈ కొత్త సీరియల్ ప్రోమోను రిలీజ్ చేయించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సీరియల్ ప్రేమ, ద్వేషం అనే రెండు భిన్నమైన ఎమోషన్స్ చుట్టూ తిరగనుంది. ప్రోమోలో చూపించిన దాని ప్రకారం లోతైన ప్రేమ, తీవ్రమైన ద్వేషం మధ్య సాగే కథ ఇది. ఈ సీరియల్ లో సిరి, వెన్నెల, విష్ణు, అభిరాం అనే నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరగనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు పగ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ తో ఈ సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
ఈ ప్రోమోలో నాగార్జున కనిపించడం, తనదైన స్టైల్ లో ఈ సీరియల్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడం హైలైట్ గా నిలిచింది. ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో, ద్వేషం కూడా అంతే తీవ్రంగా ఉంటుందనే డైలాగ్ తో ప్రోమో మొదలు కావడం ఆకట్టుకుంటుంది. సిరి, వెన్నెల పాత్రల మధ్య ఏదో పెద్ద సంఘర్షణ ఉండబోతుందని, ఆ కథలోకి విష్ణు, అభిరాం ఎంట్రీతో మరింత ట్విస్ట్ రానుందని తెలుస్తోంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీరియల్ పై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ సీరియల్ ఎప్పుడు ప్రసారం అవుతుంది, టైమ్ స్లాట్ ఏంటనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే వస్తోందని మాత్రమే ప్రోమోలో పేర్కొన్నారు. జియో హాట్ స్టార్ లో కూడా ఈ సీరియల్ స్ట్రీమింగ్ కానుంది.
నాగార్జున చేతుల మీదుగా ప్రోమో రిలీజ్ కావడంతో ఈ సీరియల్ పై అంచనాలు పెరిగాయి. అసలు సిరి, వెన్నెల ఎవరు, వీరి మధ్య ప్రేమ, ద్వేషం ఎందుకు మొదలైందనేది తెలియాలంటే సీరియల్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.




