Pavitra Bandham: జీ తెలుగులో మరో కొత్త సీరియల్ 'పవిత్ర బంధం'.. పునర్జన్మల నేపథ్యంలో మిస్టికల్ లవ్ స్టోరీ!
Nov 29, 2026 2:28PM

జీ తెలుగులోకి మరో ఇంట్రెస్టింగ్ సీరియల్ రాబోతోంది. ఆ సీరియల్ పేరే 'పవిత్ర బంధం'. ఈ సీరియల్ ప్రమోషనల్ ట్రైలర్ ను ప్రముఖ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఇటీవల లాంచ్ చేశారు. మోడ్రన్ ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, పునర్జన్మ, మైథలాజికల్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో ఈ సీరియల్ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
ఈ సీరియల్ కథ పునర్జన్మల చుట్టూ తిరగనుంది. ఒక జన్మలో కలిసి ఉండి, మరుజన్మలో విడిపోయిన ఆత్మలు మళ్లీ కలవడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇందులో ఒక యువతి ఇంటి దగ్గరే చిన్న ట్యూషన్ సెంటర్ నడుపుతూ ఉంటుంది. మరోవైపు కార్తికేయ అనే డాక్టర్ పాత్ర కీలకంగా ఉండనుంది. వీరిద్దరి మధ్య బంధం, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్, చీకటి మంత్రాలు, సూపర్ నేచురల్, మైథలాజికల్ సన్నివేశాలతో కథ ఆసక్తికరంగా సాగనుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
ఈ సీరియల్ లో ఆర్యన్ హీరోగా నటిస్తుండగా, మహిమ హీరోయిన్ గా తెలుగు టీవీలోకి అడుగుపెడుతోంది. మహిమకు ఇదే ఫస్ట్ తెలుగు సీరియల్ కావడం విశేషం. వీరితో పాటు సౌమ్యలత, ఆశ, ఉష, డాక్టర్ పి. అనుహ్య రెడ్డి వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త జంట ఆర్యన్-మహిమ కెమిస్ట్రీ ప్రోమోలోనే ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ సీరియల్ "కమింగ్ సూన్" అంటూ జీ తెలుగులో ప్రోమోలు ప్రసారమవుతున్నాయి. అధికారిక ప్రీమియర్ డేట్, టైమ్ స్లాట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే నవంబర్ లోనే అనౌన్స్ చేయడంతో డిసెంబర్ లో ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో వస్తున్న ఈ పవిత్ర బంధం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



