Monal Gajjar: నెట్టింట మోనాల్ గజ్జర్ పోస్ట్ వైరల్!
Nov 29, 2026 2:03PM

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ మోనాల్ గజ్జర్ (Monal Gajjar) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఎమోషనల్ కోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ME IN MY FEELINGS" అనే క్యాప్షన్ తో ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ లో "I quietly observe how people treat me" అంటూ జనాలు తనని ఎలా ట్రీట్ చేస్తున్నారో నిశ్శబ్దంగా గమనిస్తానని, ఎప్పుడూ గొడవపడనని కానీ మనసులో నోట్ చేసుకుంటానని రాసుకొచ్చింది.
ఆ పోస్ట్ లో మోనాల్ ఇంకా "Rather than arguing or asking for change, I shift how I engage with you. My time, energy, and presence will mirror the way you choose to show up" అంటూ వాదించే బదులు ఎదుటి వాళ్ళతో తన ప్రవర్తనని మార్చుకుంటానని, వాళ్లు తనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే తను కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తానని స్పష్టం చేసింది. "Respect goes both ways, and I believe actions reveal more than words ever could" అంటూ మాటల కంటే చేతలే నిజం చెప్తాయని నమ్ముతానని తన ఫీలింగ్స్ ను బయటపెట్టింది.

మోనాల్ గజ్జర్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫీలింగ్స్, లైఫ్ లెస్సన్స్, పాజిటివ్ కోట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా పెట్టిన ఈ "Me In My Feelings" పోస్ట్ చూసిన ఫ్యాన్స్ మోనాల్ ఏదో పర్సనల్ విషయంలో హర్ట్ అయ్యిందా, ఎవరి గురించి ఇలా పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది చాలా రిలేటబుల్ కోట్ అంటూ తమ స్టోరీల్లో కూడా షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా మోనాల్ ఎందుకు ఇలాంటి ఎమోషనల్ పోస్ట్ ఎందుకు పెట్టిందనేది మాత్రం ఆమె మాత్రమే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మోనాల్ కి ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. తన టైమ్, ఎనర్జీ, ప్రెజెన్స్ కి విలువ ఇచ్చే వాళ్లతోనే ఉంటాననే ఆమె మెసేజ్ నెటిజన్లకు బాగా కనెక్ట్ అయ్యింది.



