.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -111 లో.... ఎలాగైనా చక్రి ఫ్యామిలీ ని రెసాట్ నుండి పంపించాలని ఆది అనుకుంటాడు. అప్పుడే ఎదురుగా చక్రి ఇంకా వేరే వాళ్ళు తగ్గ ఫర్ ఆడుతారు. అది చూసి వాళ్ళని రెసాట్ నుండి పంపించడానికి ఇదే కరెక్ట్ టైమ్.. వాళ్ళు మనం తగ్గ ఫర్ ఆడుదాం.. ఎవరు ఓడిపోతే వాళ్ళు రెసాట్ నుండి వెళ్ళాలని చెప్దామని ఆది అంటాడు. దాంతో ప్రతాప్ సరే అంటాడు. ముందు ఆది వెళ్లి తగ్గఫర్ ఆడుతాడు. తర్వాత ప్రతాప్, హారిక, లలిత జాయిన్ అవుతారు. అటువైపు చక్రి, కేశవ కన్నా, మహా ఆడుతారు.
తగ్గఫర్ లో చక్రి వాళ్ళు గెలుస్తారు. ఎవరో ఓడిపోతే రెసాట్ నుండి వెళ్ళాలన్నారని చక్రి అనగానే ఆది పట్టరాని కోపంగా ఉంటారు.. అందరు అక్కడ నుండి వెళ్తారు. ఆ తర్వాత సిరి మహా దూరం నుండి చూసి బాధపడుతుంది. అదంతా కన్నా చూసి సిరిని ఎత్తుకొని మహా దగ్గరికి తీసుకొని వెళ్తాడు. దాంతో మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు పాప కన్పించడం లేదని ఆది వాళ్ళు టెన్షన్ పడుతారు. సీసీటీవీ లో చూస్తే అందులో కన్నా పాపని ఎత్తుకొని వెళ్లినట్లు ఉంటుంది. అది చూసి వాళ్ళ దగ్గరికి గొడవకి వెళ్తారు. పాప ఎక్కడరా అని కన్నా కాలర్ పట్టుకొని అడుగుతాడు. అప్పుడే మహా వచ్చి ఆదిపై చెయ్ చేసుకోబోతుంది.. మహా అని హారిక అనగానే తను ఆగిపోతుంది. నేను సిరి గురించి బాధపడుతున్నానని నా దగ్గరికి తీసుకొని వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చి చూడండి సంస్కారం అంటే ఏంటో తెలుస్తుంది.. వాళ్ళు నన్ను ఒక కూతురులాగా చూసుకుంటారు అమ్మ అనుకుంటున్నారని వాళ్ళ గురించి మహా తన వాళ్ళకి చెప్తుంది. దాంతో కోపంగా అక్కడ నుండి వెళ్తారు. ఆ తర్వాత రెసాట్ వదిలి వెళ్తుంటే ఎదురుగా మహా ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అని మహాపై లలిత కోప్పడుతుంది.
ఆ తర్వాత మహా వాళ్ళు కూడా రెసాట్ నుండి వెళ్తారు. సారీరా నా వాళ్ళ డిస్టబ్ అయిందని కన్నాకి మహా సారీ చెప్తుంది. అందరు ఇంటికి రిటర్న్ అవుతారు. ఛీ మహాతో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడుదామంటే వీలు కాలేదని చక్రి అనుకుంటాడు. మహా నిద్రలో తన భుజాలపై పడుకుంటుంది దాంతో చక్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంటికి వచ్చాక చక్రికి కాలేజీ నుండి సర్టిఫికెట్స్ వచ్చాయని ఫోన్ వస్తుంది. ఆ విషయం మహాకి చెప్పగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో గాయత్రి వాళ్లని భోజనానికి పిలిచానని మాధవ అనగానే ఇంట్లో వాళ్ళు తనపై కోప్పడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
