Home

»

Tv News

Illu illalu pillalu : ఆస్తి కోసం కాకుండా ఆశయం కోసం ధీరజ్.. కొడుకు పట్టుదలకు రామరాజు ఫిదా!

May 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -468 లో.....ధీరజ్ దగ్గరికి  వేదవతి, నర్మద వచ్చి మాట్లాడతారు. మీ నాన్న దగ్గర డబ్బు తీసుకుంటే ఏమవుతుంది.. అంత మొండితనం పనికి  రాదని వేదవతి అంటుంది. నాన్న దగ్గర తీసుకుంటే నేను సొంతగా కష్టపడి తీసుకున్నట్టు  ఏం ఉంటుంది.. ఇది మొండితనం కాదు సాధించాలని పట్టుదల అని ధీరజ్ అంటాడు. అదంతా రామరాజు వింటాడు. అప్పుడే సాగర్ వచ్చి నువ్వు  అదృష్టవంతుడివిరా చిన్నోడా.. అదే మాటలు నేను అంటే మీ నాన్న నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసేవాడని సాగర్ అంటాడు.

ఊరుకోరా మీ నాన్న అక్కడ ఉన్నాడని వేదవతి అంటుంది. ఆ తర్వాత పిల్లలకి  నా ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదని వేదవతితో చెప్తూ రామారాజు బాధపడుతాడు. ఆ తర్వాత సుకన్యని తిరుపతి తన మాటలతో ఇబ్బంది పెడుతుంటే సుకన్య అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత సుకన్యకి భాగ్యం వాళ్ళు ఫోన్ చేసి అక్కడ సిచువేషన్  ఎలా ఉందని  అడుగుతారు. ఇక్కడ నగల గురించి గొడవ జరిగిందని ఏం చెప్పకుండానే ఫోన్ కట్ చేస్తుంది. దాంతో  అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని భాగ్యం వాళ్ళు వల్లికి  ఫోన్ చేస్తారు. భద్రవతి వాళ్ళు వచ్చి గొడవ చేసింది వల్లి చెప్తుంది. అప్పుడే సుకన్య వచ్చి ఫోన్ లాక్కొని ఇందాకే చెప్పాను కదా అని ఫోన్ కట్ చేస్తుంది.

మరొకవైపు ప్రేమని తీసుకొని ధీరజ్ ఫైనాన్స్ ఇచ్చే అతని దగ్గరికి  వెళ్తాడు. అక్కడ అతని మాటలు కండిషన్స్ ప్రేమకి  నచ్చవు.. వెళ్ళిపోదామని ప్రేమ  అంటుంది.. ఏం పర్వాలేదని ధీరజ్ అన్ని పేపర్స్ పై సంతకం పెడుతాడు. ప్రేమ టెన్షన్ పడుతుంటే నువ్వు  హ్యాపీగా ఉండు అని ధీరజ్ చెప్తాడు. మరొకవైపు సాగర్, శ్రీనివాస్ రావు డ్రింక్ చేస్తారు. ఇంట్లో వాళ్ళ గురించి నెగెటివ్ గా చెప్పి సాగర్ మనసు మార్చాలని శ్రీనివాస్ రావు అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com