Home

»

Tv News

Jayam serial :  సుధా ప్లాన్ అద్భుతం.. విశ్వ కళ్లుగప్పి షష్టిపూర్తి వేడుకలో సందడి!

May 12, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -266 లో.....పెద్దసారు, శకుంతల షష్టిపూర్తికి సుధాని రుద్ర పిలిపిస్తాడు. శకుంతల చూడకుండా లోపలికి తీసుకొని వస్తారు. ఒక్క శకుంతల తప్ప మిగతా అందరు సుధాని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సుధా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. థాంక్స్ రుద్ర మా ఆడపడుచుని కలిసేలా చేసినందుకని ఇందుమతి చెప్తుంది. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునేలా నువ్వే చెయ్యాలి పిన్ని అని రుద్ర తనకి ప్లాన్ చెప్తాడు. మరొకవైపు సుధా గుడికి వెళ్లకుండా వాళ్ళ అన్న ఇంటికి వెళ్లి ఉంటుందని విశ్వకి డౌట్ వస్తుంది.

దాంతో విశ్వ ఇంటికి వెళ్లి చూస్తాడు. సుధా కనిపించదు. ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్లి ఉంటుందని విశ్వ అనుకొని పెద్దసారు ఇంటికి కోపంగా బయల్దేరతాడు. మరొకవైపు అందరు ఒక్కొక్కరుగా పెద్ద సారు, శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సుధా పైన కొంగు కప్పుకొని వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటుంది. పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు పైడిరాజుకి విశ్వ ఫోన్ చేస్తాడు. అప్పటికే తనకి డౌట్ వచ్చిందేమోనని పైడిరాజు, లక్ష్మికి చెప్పి సుధాని అక్కడ నుండి పంపిస్తాడు. ఆ తర్వాత విశ్వ కార్ వచ్చి ఆగగానే ఎదురుగా రుద్ర వెళ్లి.. సర్ ఈ రోజు మా పెద్దనాన్న వాళ్ళ షష్టిపూర్తి లోపలికి రండి అంటాడు. మేడమ్ ని పిలువు అని విశ్వ అనగానే ఇక్కడ ఎందుకు ఉంటుందని రుద్ర అంటాడు. అప్పుడే సుధా కాల్ చేస్తుంది. ఎక్కడున్నావని విశ్వ అడుగుతాడు. నేను గుడికి వెళ్లి ఇప్పుడే వచ్చాను.. మీ మిస్డ్ కాల్ ఉంటే చేసానని సుధా అంటుంది. దాంతో విశ్వ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ఈ సందర్భంగా నా బిజినెస్ కి సంబంధించిన అన్ని బాధ్యతలు వీరుకి అప్పగిస్తున్నానని రుద్ర అంటాడు. దాంతో వీరు హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు ఇష్టం లేదు.. నా అల్లుడు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎదగాలని శకుంతల అనగానే వీరు, ఇషిక డిస్సపాయింట్ అవుతారు. సారీ వీరు.. పెద్దమ్మ నిర్ణయంలో మార్పు ఉండదని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com