Home

»

Tv News

Bigboss 10 contestants: పదినెలల బిడ్డను వదిలి బిగ్ బాస్ లోకి చైత్ర రాయ్.. ఆటో రామ్ ప్రసాద్ ఇన్ హౌస్!

Sep 7, 2026 10:58AM

బిగ్ బాస్ సీజన్ 10 తెలుగులో హౌస్ లోకి ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ ఫేమ్ చైత్ర రాయ్ ఎమోషనల్ ఎంట్రీ ఇచ్చింది. అష్టాచమ్మా, అలా మొదలైంది.. బ్రహ్మముడి లాంటి సీరియల్స్ తో ఫేమస్ అయిన చైత్రకు ఇద్దరు కూతుర్లున్నారు. తనకు 10 నెలల చిన్న బిడ్డను వదిలిపెట్టి బిగ్ బాస్ కి వచ్చానని చెప్తూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఈ నిర్ణయం తనకు ఎంత కష్టమో చెప్తూ ఆడియన్స్ సింపతీ కొట్టేసింది. గతంలో సోషల్ మీడియాలో తనపై వచ్చిన ఒక నెగెటివ్ కామెంట్ తో డిప్రెషన్ లోకి వెళ్లానని.. తన రియాలిటీ ఏంటో బిగ్ బాస్ వేదికగా నిరూపిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పింది.

 

ఏడవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్ మాస్ ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా వైరల్ అయిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని హుక్ స్టెప్ పాటకు తనదైన స్టైల్ లో స్టెప్పులేసి అలరించాడు. ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లను స్క్రీన్ పై చూపించి వాళ్లు ఏమనుకుంటున్నారో చెప్పమని నాగ్ అడగ్గా, తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. బిగ్ బాస్ పేరెంట్స్ మీద ఒట్టేసి హౌస్ లో ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇస్తానని కావాలంటే నన్ను నామినేట్ చేయండంటూ చెప్పి హౌస్ లోకి దూసుకెళ్లాడు.

 

8వ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్షలో అందరి దృష్టిని ఆకర్షించిన లేడీ కామన్ గ్రూప్ నుంచి షాలిని పటేల్ ని జ్యూరీ మెంబర్ నవదీప్ సెలెక్ట్ చేశాడు. అగ్నిపరీక్షలో తన క్యూట్ నెస్, క్లారిటీ ఆఫ్ థాట్ తో షాలిని మంచి మార్కులు కొట్టేసింది. స్టేజ్ పై నాగార్జునను చూడగానే తెగ పొగిడేసింది. మీరు నా ఫేవరేట్ అంటూ మెప్పించే ప్రయత్నం చేసింది. దానికి నాగ్ థాంక్స్ అమ్మ అని అనేశాడు. 

 

ఈ ముగ్గురికి హౌస్ లోకి వెళ్లాక స్పెషల్ పవర్స్ కోసం టాస్క్ పెట్టగా అమన్ మసూద్ సంఛాలక్ గా వ్యవహరించాడు. ఈ టాస్క్ లో జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, షాలిని పటేల్ మ్యాజిక్ కీలు గెలిచి పవర్స్ సాధించారు. సీరియల్ బ్యూటీ చైత్ర రాయ్ ఓడిపోయింది. దీంతో ఫస్ట్ రోజే 4 మ్యాజిక్ కీలు 4 గురికి వెళ్లిపోయాయి. ఇక హౌస్ లోకి సగం మంది వచ్చేసరికి వాతావరణం ఒక్కసారిగా హీటెక్కిపోయింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com