Home

»

Tv News

'గుండె నిండా గుడి గంటలు' ఫేమ్ బాలు.. సీరియల్ టూ బిగ్ బాస్ హౌస్.!

Sep 6, 2026 2:58PM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోలలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫేమ్ బాలు కూడా ఉన్నాడు. స్టార్ మా టీవీలో నెంబర్ 1 సీరియల్ గా దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలు పాత్రతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ సీరియల్ హీరో ఇప్పుడు బుల్లితెర నుండి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నాడు. సెప్టెంబర్ 6న ప్రీమియర్ లో నాగార్జున చేతుల మీదుగా ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది సెలబ్రిటీలలో బాలు ఒకరు.

అసలు బాలు అలియాస్ అమర్ దీప్ చౌదరి గురించి తెలిసిందే. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలుగా, మీనా భర్తగా తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీరియల్ తోనే తెలుగు ఇంటింటా ఫేమస్ అయ్యాడు. అంతకుముందు జానకి కలగనలేదు లాంటి సీరియల్స్ లో కూడా చేశాడు. సీరియల్స్ లో సైలెంట్ లవర్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించే బాలు, నిజ జీవితంలో చాలా ఫన్ లవింగ్ పర్సన్. ఇన్ స్టా లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

బిగ్ బాస్ హౌస్ లో బాలు ఎంట్రీతో గేమ్ మొత్తం మారిపోతుందని టాక్. ఇప్పటికే సీరియల్ ఆడియన్స్ లో బాలుకి లేడీస్ ఫ్యాన్ బేస్ ఎక్కువ. హౌస్ లోకి వెళ్తే తన సాఫ్ట్ నేచర్, లాయల్టీ, టాస్కుల్లో హార్డ్ వర్క్ తో స్ట్రాంగ్ కంటెండర్ అవుతాడని వినబడుతుంది. సీరియల్ లో భార్య మీనాను ఎలా సపోర్ట్ చేస్తాడో.. హౌస్ లో కూడా అలాగే ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేస్తాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్-10 లో గుండె నిండా గుడి గంటలు బాలు ఎంట్రీ కన్ఫమ్ అయ్యాడనే వార్త నెట్టింట వైరల్ గా మారింది.‌ బాలు హౌస్ లోకి వెళ్లి టైటిల్ గెలుస్తాడా లేక మిడ్ లోనే ఎలిమినేట్ అవుతాడా అనేది చూడాలి మరి.

 

 

[Gunde Ninda Gudi Gantalu Balu Bigg Boss, Balu Bigg Boss Telugu 10, Amardeep Bigg Boss Entry]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com