జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -366 లో.. గంగ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే వ్రతంకి జయ హాస్టల్ వార్డెన్ ని రంగా పిలిపిస్తాడు. తనని చూసి జయ షాక్ అవుతుంది. మీ జయ నాకు బాగా తెలుసు తనకి కూడా నేను బాగా తెలుసు కదా నిషా అని వార్డెన్ అనగానే జయ షాక్ అవుతుంది. తన పేరు నిషా కాదు జయ అని ఇందుమతి వాళ్ళు అంటారు. మేం అలాగే పిలిచే వాళ్ళం తన గురించి మీకు చాలా విషయలు తెలియాలని ఆవిడ అనగానే జయలో టెన్షన్ మొదలవుతుంది.
ఆ తర్వాత ఇప్పుడు ముందు అయితే పూజ కానివ్వండి. ఆ తర్వాత అన్ని చెప్తానని వార్డెన్ అంటుంది. గంగ వరలక్ష్మి వ్రతం చేస్తుంది. అన్నయ్య సర్ ఎక్కడ అని గంగ అడుగుతుంది. ఏమోనే బయటకు వెళ్ళాడని రంగా చెప్తాడు. ఆశీర్వాదం తీసుకోవాలి కదా అని గంగ అంటుంది. అది ఇష్టం లేకనే వెళ్లి ఉంటాడు.. ముందు అయితే పని కానివ్వు అని శకుంతల కోప్పడుతుంది. సర్ నేను వ్రతం చేస్తుండగా వెళ్ళాడంటే ఏంటి అర్ధం అంటే నాపై ఇంకా సర్ కోపంగా ఉన్నాడని అర్ధం అని గంగ బాధపడుతుంది. ఆ తర్వాత పూజ అయ్యాక మా జయ గురించి చెప్తానన్నారు కదా ఏంటో చెప్పండి అని సుధా అడుగుతుంది.
తను చాలా క్రమశిక్షణతో పెరిగిన పిల్ల అని వార్డెన్ చెప్పగానే రంగా షాక్ అవుతాడు. తను మంచిది కాబట్టే తనకి మంచి కుటుంబం దొరికిందని జయ గురించి పాజిటివ్ గా చెప్తుంది. అవునా నా బంగారు తల్లి అని జయని సుధా దగ్గరికి తీసుకుంటుంది. వదిన ఆవిడకి మొదటి వాయినం ఇవ్వమని సుధా చెప్పగానే శకుంతల తనకి వాయినం ఇస్తుంది. ఆ తర్వాత వార్డెన్ వెళ్ళిపోతుంటే రంగా ఆపి మీరు నాకు ఏం చెప్తానని చెప్పారు ఏం చెప్పారని రంగా కోప్పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Jayam serial Zee Telugu, Jayam episode 366 update, Jayam serial latest written update, Zee Telugu serials Jayam, Jayam serial warden twist]




