Home

»

Tv News

Agnipariksha season2 : ఝాన్సీపై హేమంత్ సంచలన కామెంట్.. జ్యూరీ ఫైర్!

Sep 3, 2026 4:36PM

అగ్నిపరీక్ష సీజన్-2 నిన్నటి 19వ ఎపిసోడ్ ఫుల్ ఫైర్ మోడ్ లో సాగింది. గేమ్స్, ట్విస్ట్ లతో ఆకట్టుకుంది.  నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.. కంటెస్టెంట్స్ కి ర్యాంకింగ్ టాస్క్ ఒకటి ఇచ్చారు జ్యూరీ. అయితే ఈ టాస్క్ లో టాస్క్ కంటే ఎక్కువగా మాటల యుద్ధమే నడిచింది. రెండో స్థానం కోసం హేమంత్, ఝాన్సీ మధ్య జరిగిన వాగ్వాదం ఎపిసోడ్ కు హైలైట్ గా మారింది. ఝాన్సీ గెలిచిన వాళ్లతో మాత్రమే బాగా ఉంటుందని హేమంత్ ఓపెన్ గా ఆరోపించాడు. దీనికి ఝాన్సీ చాలా ఓవర్ గా రియాక్ట్ అయి ఒక్కరితో ఆ మాట చెప్పించినా నేను ఈ స్థానాన్ని వదిలి వెళ్లిపోతానని ఛాలెంజ్ చేసింది.

ఝాన్సీ వేసిన ఛాలెంజ్ ఆమెకే ఎదురుతిరిగింది. భాగి, రామకృష్ణతో సహా చాలా మంది కంటెస్టెంట్లు అది నిజమే.. ఆమె విన్నర్స్ తోనే ఎక్కువగా మాట్లాడుతుందని చెప్పేశారు. దీంతో జ్యూరీలో ఉన్న శ్రీముఖి కూడా కల్పించుకుని..చూశావా? అందరూ అదే అంటున్నారు, ఒక్కరు చెప్పినా వెళ్తానన్నావ్ కదా, ఇప్పుడు వెళ్లిపోమని ఝాన్సీకి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ ఒక్క సీన్ తో హౌస్ లో ఎవరెవరు ఎలా గ్రూప్ గా ఉన్నారో బయటపడిపోయింది.

ఈ ఎపిసోడ్ లో జ్యూరీ పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. నవదీప్, బిందు, శ్రీముఖి ముగ్గురూ కంటెస్టెంట్లను నిలదీశారు. ముఖ్యంగా బిందు హేమంత్ ను .. మొదటి స్థానానికి ఎందుకు వచ్చావ్.. నిలబడలేనప్పుడు వెళ్లి రెండో స్థానంలో ఉండమని గట్టిగా చెప్పడం.‌ కంటెస్టెంట్లలో ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో చూపించింది. కేవలం పొజిషన్ లో నిలబడటం కాదు.. ఆ పొజిషన్ కి ఎందుకు అర్హులో వాదించుకోవాలని జ్యూరీ క్లియర్ గా చెప్పింది.

 

మొత్తానికి ఈ ఎపిసోడ్ ఒకరి గేమ్ ని మరొకరికి అర్థమయ్యేలా చేసింది. ఎవరు నిజంగా స్ట్రాంగ్, ఎవరు కేవలం మాటలతోనే ముందుకు వెళ్లాలని చూస్తున్నారో తేలిపోయింది. నోటి మాటతో కాకుండా టాస్కులతో, క్లారిటీతో మాట్లాడిన వాళ్లకే జ్యూరీ పవర్ ఇవ్వడం.‌. MVP గా ఎంపిక చేయడం జరిగింది. అందుకే ఈ ఎపిసోడ్ తర్వాత హౌస్ లో లెక్కలు పూర్తిగా మారిపోయాయి.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com